Team India : వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కి 15 మందితో కూడిన జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. శుబ్ మన్ గిల్ కెప్టెన్ గా, రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ గా ప్రమోట్ చేశారు. అక్టొబర్ 02 నుంచి 6 మధ్య తొలి టెస్ట్, అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఇంగ్లండ్ పర్యటనలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఆడిన జట్టును స్వల్ప మార్పులతోనే భారత్ విండిస్ తో బరిలోకి దిగనుంది. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇంకా గాయం నుంచి కోలుకోని కారణంగా వెస్టిండీస్ సిరీస్ కు దూరం అయ్యాడు. అలాఏ ఇంగ్లండ్ పర్యటనలో విఫలం చెందిన కరుణ్ నాయర్ పై వేటు పడింది. పంత్ దూరం కావడంతో ధ్రువ్ జురెల్ తో పాటు తమిళనాడు ప్లేయర్ నారాయన్ జగదీశన్ జట్టుకు ఎంపికయ్యాడు.
Also Read : IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్
ఇంగ్లాండ్ పర్యటలో వరుస వైఫల్యాల కారణంగా వెస్టిండీస్ సిరీస్ కి కరుణ్ నాయర్ పై వేటు పడింది. దాదాపు ఏడు సంవత్సరాల విరామం తరువాత టీమిండియా తరపున ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ద్వారా రీఎంట్రి ఇచ్చిన కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఐదు టెస్టుల్లో భాగంగా నాలుగు మ్యాచ్ లు ఆడిన కరుణ్ నాయర్.. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేయగలిగాడు. బీసీసీఐ అతనికి మరో అవకాశం ఇచ్చేందుకు మొగ్గు చూపకపోవడం గమనార్హం. గాయం కారణంగా ఇంగ్లాండ్ సిరీస్ లో మధ్యలోనే జట్టుకు దూరమైన ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా విండీస్ సిరీస్ తో రీ ఎంట్రి ఇవ్వడానికి సిద్దమయ్యాడు.
Also Read : Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?
పేస్ విభాగంగా జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తో కలిసి ప్రసిద్ధ్ కృష్ణ మరోసారి సేవలందించనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. స్పిన్ ఆల్ రౌండర్ల కోటాలో జడేజా, అక్షర్ పటేల్ తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా బరిలోకి దిగనున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నీ ముగిసిన తరువాత టీమిండియా సొంత గడ్డ పై వెస్టిండీస్ తో రెండు టెస్టులు ఆడనుంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ 2025-27 లో భాగంగా అక్టోబర్ 02 నుంచి అక్టోబర్ 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. చివరగా.. గిల్ సేన ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో తలపడి 2-2 సమం చేసుకున్న విషయం తెలిసిందే.
టీమిండియా జట్టు :
శుబ్ మన్ గిల్ (కెప్టెన్), జడేజా (వైస్ కెప్టెన్), జైస్వాల్, కే.ఎల్. రాహుల్, సుదర్శన్, పడిక్కల్, జురెల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్, జగదీశన్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.