BigTV English

OTT Movie : ఫీలింగ్స్ లేని కానిస్టేబుల్ ప్రా*స్టి*ట్యూట్ గా మారితే… కిక్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఫీలింగ్స్ లేని కానిస్టేబుల్ ప్రా*స్టి*ట్యూట్ గా మారితే… కిక్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇప్పుడు బుల్లితెరలపై వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. సీరియల్స్ ని చూడడం తగ్గించి వీటిపై మక్కువ చూపుతున్నారు మూవీ లవర్స్. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఓటిటిలో అదరగొడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ఒక మహిళా కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. ఆమె నెరస్తులను పట్టుకోవడానికి వేశ్యగా మారుతుంది. చివరివరకు ఈ సిరీస్ ఉత్కంఠంగా సాగిపోతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘షి’ (She). 2020 లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు ఆరిఫ్ అలీ, అవినాష్ దాస్ దర్శకత్వం వహించారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో మార్చి 20, 2020 నుంచి అందుబాటులో ఉంది. ఈ స్టోరీ ముంబైలోని ఒక సాధారణ మహిళా కానిస్టేబుల్ భూమి పరదేశి చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్‌ను ఇమ్తియాజ్ అలీ, దివ్యా జోహ్రీ రచించారు. ఇందులో ఆదితి సుధీర్ పోహంకర్, విజయ్ వర్మ , కిషోర్ ప్రధాన పాత్రలను పోషించారు.


స్టోరీలోకి వెళితే

భూమి అనే ఒక మహిళ పేద కుటుంబం నుండి వస్తుంది. ఆమె పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ఆమె భర్తతో విడాకుల కోసం ప్రయత్నిస్తూ, మరోవైపు అనారోగ్యంతో ఉన్న తన తల్లిని, కాలేజీలో చదువుతున్న సోదరిని తానే పోషిస్తూ ఉంటుంది. ఆమె జీవితం సాధారణంగా సాగిపోతూ ఉంటుంది. ఒక రోజు ఆమెను యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్‌లో చేరమని పై అధికారులు ఆదేశిస్తారు. ఈ బృందం ఒక పెద్ద డ్రగ్ లార్డ్ నయాక్‌ను పట్టుకోవడానికి పని చేస్తోంది. ఇందులో భూమికి ఒక అండర్‌కవర్ మిషన్ అప్పగిస్తారు. దీనిలో ఆమె ఒక వేశ్యగా నటించి డ్రగ్ రింగ్‌ను బయటపెట్టాలి. మొదట్లో ఆమె ఈ పనికి సంకోచిస్తుంది, కానీ తన విధులను నిర్వర్తించడానికి ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె తనలోని దాగివున్న శక్తిని బయటకు తీస్తుంది. ఇది ఆమెకు ఒక రకమైన సాధికారతను ఇస్తుంది. ఇక భూమి రంగంలోకి దూకుతుంది.

మిషన్ సాగుతున్నప్పుడు, భూమి నయాక్‌తో సన్నిహితంగా మెలగడం ప్రారంభిస్తుంది. ఆమె అతనితో సంబంధం పెంచుకుంటూ, అతని డ్రగ్ ట్రాఫికింగ్ గురించి సమాచారాన్ని పోలీసులకు అందిస్తుంది. అయితే, ఈ క్రమంలో ఆమె తన పోలీస్ విధులు, కోరిక ల మధ్య సంఘర్షణలో పడుతుంది. ఆమె తన అందాలను ప్రదర్శించడంలో మొదట ఇబ్బంది పడ్డా, ఆ తరువాత రెచ్చిపోతుంది.  నయాక్‌తో కూడా ఆమె సంబంధం బాలపడుతూ పోతుంది. ఆమె అక్కడికి ఎందుకు వచ్చిందో, అక్కడ చేస్తున్నదేమిటి ? అనే సందేహంలో పడుతుంది. ఇంతలో ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఆమె విడిపోయిన భర్త ఆమెను వెంబడిస్తాడు. ఆమె సోదరి వైఖరి ఆమెకు మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. చివరికి వీటన్నిటినీ భూమి ఎలా అధిగమిస్తుందనేది, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×