Dating App Cheating: డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన ఇద్దరు యువకులు మధ్య జరిగిన ఈ ఘర్షణ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు “Groder” అనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. ఈ ఇద్దరు అందులోనే చాటింగ్ చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ పర్సనల్‌గా కలవాలని నిర్ణయించుకున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. ముందుగా యువకుడు అక్కడికి వెళ్లి ఓయో రూమ్‌లో వేచి ఉన్న కొద్దిసేపటికి అక్కడికి డాక్టర్ కూడా వచ్చాడు. అయితే ఆ యువకుడు డాక్టర్‌కు నచ్చలేదు. ఇదే విషయాన్ని డాక్టర్ అతనికి చెప్పాడు.
కానీ మాట వినని యువకుడు ఆ వైద్యుడిపై అఘాయిత్యం చేయబోయాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో యువకుడు డాక్టర్ పై దాడి చేశాడు. తనకి డబ్బులు ఇవ్వకుంటే ఇలా ప్రైవేట్‌గా కలిసిన విషయాన్ని మీ ఇంట్లో చెబుతానని బెదిరించాడు.
భయపడి వైద్యుడు 5,000 రూపాయలు ఆ యువకుడికి ఇచ్చాడు. ఆ తరువాత వైద్యుడు రూమ్ నుండి బయటకు వచ్చాడు. కానీ ఇంతటితో ఆగిపోలేదు. నిందితుడు వైద్యుడిని ఫాలో అవుతూ, అతను పనిచేస్తున్న హాస్పిటల్‌కు వెళ్లి అక్కడ న్యూసెన్స్ సృష్టించడం మొదలుపెట్టాడు.
ఇక ఊహించని పరిస్థితి చోటు చేసుకుంది. నిందితుడు వైద్యుడి నుండి మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో డాక్టర్ భయపడిపోయి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు తరువాత మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.
స్థానిక పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. నిందితుని గుర్తించడానికి ప్రయత్నిస్తూ, ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఈ ఘటనలో డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం, ఫిర్యాదు చేసిన వ్యక్తి చేసిన వివరణలను పరిశీలిస్తున్నారు.
పోలీసు వర్గాలు ఇలాంటి ఘటనలు తగ్గించే విధంగా డేటింగ్ యాప్‌ల పై నియంత్రణలు పెంచే అవకాశం పై పరిశీలిస్తున్నాయి. యూజర్లలో మరింత జాగ్రత్త అవసరమని, వ్యక్తిగత భద్రతకు సంబంధించి అవగాహన కల్పించడానికి ప్రత్యేక ప్రచారాలు అవసరమని వారు పేర్కొన్నారు.
Also Read: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య
మాదాపూర్‌లో Groder డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై జరిగిన ఈ ఘోర సంఘటన ఒక సామాజిక హెచ్చరికగా మారింది. వ్యక్తిగత కలయికల్లో జాగ్రత్తలు పాటించడం, వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టడం సమాజానికి అత్యంత అవసరం. ఈ ఘటనపై పోలీసులు పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుని త్వరలో గుర్తించి, చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు అని హామీ ఇచ్చారు.
డేటింగ్ యాప్ ద్వారా చీటింగ్
హైదరాబాద్-మాదాపూర్‌లో చోటు చేసుకున్న ఘటన
డేటింగ్ యాప్ ద్వారా చాటింగ్ చేసుకున్న ఇద్దరు యువకులు
ఓయో రూములో కలిశాక ఓ యువకుడిపై అఘాయిత్యం చేయబోయిన మరో యువకుడు
నిరాకరించిన యువకుడిని బెదిరించి డబ్బులు డిమాండ్
డబ్బులు ఇవ్వకపోతే రహస్యంగా కలిసిన… pic.twitter.com/2FplRzDN2d
— BIG TV Breaking News (@bigtvtelugu) September 25, 2025