BigTV English

Orange Peel Serum: ఇంట్లోనే.. ఫేస్ సీరం తయారు చేసుకోండిలా ?

Orange Peel Serum: ఇంట్లోనే.. ఫేస్ సీరం తయారు చేసుకోండిలా ?

Orange Peel Serum: సమ్మర్‌లో పుష్కలంగా లభించే పండ్లలో నారింజ కూడా ఒకటి. నారింజ తిన్న తర్వాత చాలా మంది తొక్కలను బయట పడేస్తుంటారు. కానీ ఇలా చెత్తగా భావించే పడేసే నారింజ తొక్కలతో కూడా ఫేస్ సీరం తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఎండబెట్టిన నారింజ తొక్కలతో ఫేస్ సీరం తయారు చేసుకుని వాడటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. నారింజ తొక్కలు మీ చర్మం కోల్పోయిన అందాన్ని తిరిగి తీసుకురాగలవు.


ప్రతి ఒక్కరూ తమ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ మీ దగ్గర నారింజ తొక్కలు ఉంటే చాలు మీకు ఏ బ్యూటీ ప్రొడక్ట్ అవసరం లేదు. వీటి సహాయంతోనే మీరు ప్రభావవంతమైన ఫేస్ సీరం తయారు చేసుకోవచ్చు. దీన్ని ముఖానికి అప్లై చేసిన తర్వాత చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా మృదువుగా కూడా ఉంటుంది దీనికి మీకు ఏ ఏ పదార్థాలు అవసరం? దీన్ని ఎలా ఉపయోగించాలి ? దాని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేస్ సీరం తయారీకి కావాల్సిన పదార్థాలు:


తాజా లేదా ఎండిన నారింజ తొక్కలు- 5
రోజ్ వాటర్ – 2-3 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- ఒక టీస్పూన్
కొబ్బరి నూనె- ఒక టీస్పూన్

నారింజ సీరం ఎలా తయారు చేయాలి ?

నారింజ తొక్కలతో సీరం తయారు చేయడానికి.. ముందుగా నారింజ తొక్కలను బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. తొక్కలు  తాజాగా ఉంటే.. మీరు వాటిని ఓవెన్‌లో కూడా ఆరబెట్టవచ్చు. దీని తరువాత.. మీరు వాటిని మెత్తగా రుబ్బుకుని పొడి చేసుకోవాలి. ఈ నారింజ తొక్క పొడిలో నిమ్మరసం, కొబ్బరి నూనె, రోజ్ వాటర్, తేనె కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీనిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి తర్వాత దీనిని మీ ముఖంపై అప్లై చేయండి. ముఖం మీద దాదాపు 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచండి.

సీరంతో ప్రయోజనాలు:

చర్మం మెరుస్తుంది: నారింజ తొక్కతో తయారు చేసిన ఈ సీరం చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా దాని ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

మచ్చలు మాయమవుతాయి: చర్మంపై మచ్చల సమస్య ఉన్నవారు ఈ సీరం ఉపయోగిస్తే.. మచ్చలు నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతాయి. అంతే కాకుండా చర్మపు రంగు ఏకరీతిగా మారుతుంది.

వృద్ధాప్య సమస్య: నారింజ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని నుండి తయారైన సీరం చర్మంపై బాహ్య ప్రభావాలను తగ్గించడానికి పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది వృద్ధాప్య సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

చర్మం మృదువుగా ఉంటుంది: ఈ సీరం చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వాడకం వల్ల చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పనిచేస్తుంది. దీనివల్ల తేమ నిలిచి ముఖం అందంగా కనిపిస్తుంది.

Also Read: వేసవిలో.. ఫేస్‌పై వీటిని అస్సలు అప్లై చేయకూడదు తెలుసా ?

నారింజ తినడానికి రుచికరమైన పండు. చర్మానికి కూడా అంతే ప్రభావ వంతంగా పరిగణించబడుతుంది. నిజానికి.. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ప్రోటీన్‌ను పెంచడానికి పనిచేసే యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. దీనితో తయారు చేసిన ఫేస్ సీరం వాడటం వల్ల ముఖంపై ముడతలు, సన్నని గీతల వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×