E-Paper
Advertisement

Horoscope Today April 7th : ఈరోజు ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – నిరుద్యోగులకు శుభవార్తలు

Horoscope Today April 7th : ఈరోజు ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – నిరుద్యోగులకు శుభవార్తలు

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 7న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణంగా విబేధాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చెయ్యకపోవడం మంచిది.

వృషభం: ఆదాయం మరింతగా పెరుగుతుంది సమాజంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

మిధునం: నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. సమాజంలో  గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.

కర్కాటకం: బంధుమిత్రుల మాటలు కొంత ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వృధా ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు అమలుపరచాలి. ఉద్యోగులు అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

సింహం: ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో మనస్పర్థలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

కన్య: మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన విషయాలు తెలుస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు అధికారుల సహాయంతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులు మరింత కష్ట పడవలసి రావచ్చు.

వృశ్చికం: సమాజంలో  గౌరవమర్యాదలు లభిస్తాయి. దూరప్రాంతం బంధువుల నుండి శుభ వార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది.

ధనస్సు: ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని చిక్కులు తప్పవు. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి.

మకరం: దూర ప్రాంత ఆప్తులు రాక  ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

కుంభం: వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగి ఊరట చెందుతారు. ఇంటా బయట సఖ్యతగా వ్యవహరించి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిత్రులతో ఇంట్లో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

మీనం: దూర ప్రయాణాలు శ్రమ మీద పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగమన అదనపు పని ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×