YouTube Shorts: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో YouTube మరో కీలక ప్రకటన వచ్చేసింది. 2025లో ముఖ్యంగా YouTube Shorts కోసం అదిరిపోయే AI ఆధారిత ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు. క్రియేటర్లకు ఈ కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి స్క్రిప్ట్ జనరేషన్ నుంచి వీడియో ఎడిటింగ్, క్యాప్షన్‌ల నుంచి ట్రాన్స్ నేషన్ల వరకు అన్ని టూల్స్ మీ షార్ట్ వీడియోను పూర్తిగా సిద్ధం చేస్తాయి.
సగం పని తగ్గింపు
వీడియోలను సరిగ్గా ఎడిట్ చేయడం, బ్యాక్‌గ్రౌండ్ తీసేయడం…ఇవన్నీ ఇప్పటి వరకూ నైపుణ్యాలు కలిగిన వారు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు, YouTube తీసుకొస్తున్న AI టూల్స్ ద్వారా ఎవరైనా తక్కువ సమయంలో ప్రొఫెషనల్ లుక్‌తో వీడియోలు సృష్టించుకోవచ్చు.
ఈ AI ఎడిటింగ్ టూల్స్ ద్వారా
-ఆటోమేటిక్ సీన్ డిటెక్షన్ ద్వారా కట్ పాయింట్లు గుర్తించుకోవచ్చు
-స్మార్ట్ ట్రాన్సిషన్స్ తో వీడియో ఫ్లో మెరుగవుతుంది.
-వన్ ట్యాప్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్ తో గ్రీన్ స్క్రీన్ అవసరం లేకుండా విజువల్ క్లారిటీ పొందొచ్చు.
ఇది ఏం చేస్తుందంటే
-మీరు ఇచ్చిన ఐడియా ఆధారంగా స్క్రిప్ట్‌లను జనరేట్ చేస్తుంది.
-ట్రెండింగ్ హుక్స్‌ను సూచిస్తుంది.
-మీరు మాట్లాడే స్క్రిప్ట్‌లను సహజంగా తయారు చేస్తుంది.
-ఈ విధంగా మీరు మీ కంటెంట్‌ను వేగంగా సిద్ధం చేసుకోవచ్చు.
డిజైన్ తెలిసీ తెలియకపోయినా
అందమైన యానిమేషన్లు, మోషన్ గ్రాఫిక్స్, సినిమాటిక్ ట్రాన్సిషన్లు… ఇవన్నీ ఇప్పటివరకు ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో అనుభవం ఉన్నవారికే సాధ్యమయ్యేవి. కానీ ఇప్పుడు, AI ఆధారిత విజువల్ ఎఫెక్ట్స్ టూల్స్ తో ఇది మరింత సులభం కానుంది.
Read Also: Viral News: నెట్టింట నకిలీ ఆధార్, పాన్ కార్డులు..ఆందోళనలో ప్రజలు
సృష్టికర్తలు కేవలం కొన్ని ట్యాప్‌లతో
-మోషన్ గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు
-సృజనాత్మక ట్రాన్సిషన్లు వినియోగించుకోవచ్చు
-స్టోరీటెల్లింగ్‌ను ఆకర్షణీయంగా మార్చవచ్చు.
-ఇది ముఖ్యంగా బిగినర్స్‌కు గొప్ప అవకాశంగా మారుతుంది. తక్కువ సమయంలోనే మంచి ఇంపాక్ట్ ఉన్న వీడియోను రూపొందించుకోవచ్చు.
తక్షణ క్యాప్షన్‌లను
సృష్టించిన కంటెంట్ ఎంత బాగుండాలంటే, అది భాషా బారియర్‌ను దాటాలి. ఇప్పుడు YouTube అందిస్తున్న మరో కీలక ఫీచర్ AI ఆధారిత క్యాప్షన్‌ల అనువాదం. ఈ ఫీచర్లు మీకు వివిధ భాషల్లో తక్షణ క్యాప్షన్‌లను అందిస్తాయి. మీ కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకెళతాయి. వినికిడి లోపం ఉన్న వారికి కూడా అభినవ అనుభూతి కలిగిస్తాయి.
అందరికీ సులభతరం
ఈ విధంగా YouTube వీడియోల యాక్సెసిబులిటీ పరంగా మరిన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. YouTube ప్రస్తుతం ఈ కొత్త AI ఫీచర్లను ప్రవేశపెడుతున్నది ఒకే లక్ష్యంతో కంటెంట్ సృష్టిని అందరికీ సులభతరం చేయడం. మీరు క్రియేటర్‌గా కొత్తగా ప్రారంభిస్తున్నా, లేక ఇప్పటికే పెద్ద ఫాలోయింగ్ కలిగి ఉన్నా ఈ టూల్స్ మీ సమయాన్ని ఆదా చేస్తాయి, క్వాలిటీని మెరుగుపరుస్తాయి.
అవసరమైనది కేవలం:
-మీ ఆలోచనను చెప్పడం.
-టూల్స్ ఉపయోగించి ఆలోచనను అమలు చేయడం.
-ప్రపంచానికి కొత్తగా చూపించడమే!
ఈ ఫీచర్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
YouTube ప్రకారం ఈ కొత్త AI ఆధారిత ఫీచర్లు 2025లో దశలవారీగా అన్ని యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. మొదట భారత్ వంటి కంటెంట్ హబ్‌లలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.