BigTV English

Horoscope Today June 4th: తెలుగు రాశి ఫలితాలు: నూతన వాహనం కొనుగోలు చేస్తారు – ప్రముఖులతో పరిచయాలు 

Horoscope Today June 4th: తెలుగు రాశి ఫలితాలు: నూతన వాహనం కొనుగోలు చేస్తారు – ప్రముఖులతో పరిచయాలు 

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జూన్‌ 4న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం: కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపార కొన్ని వ్యవహారాలలో పట్టుదలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. స్వల్ప ధనలాభం సూచనలు ఉన్నవి. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.

వృషభం: ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. జీవితభాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు.


మిథునం: నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది.పాతరుణాల తీర్చగలుగుతారు. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం: నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థికంగా పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నూతన భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

సింహం: ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాల అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యవిషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.

కన్య: నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో చర్చలు అనుకూల ఫలితాన్నిస్తాయి. స్థిరాస్థి క్రయవిక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణప్రయత్నాలు కలసి వస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.

వృశ్చికం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమకు అల్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. జీవిత భాగస్వామ్య సలహాలు కొన్ని విషయాలలో కలసివస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ధనస్సు: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు రాజి ఏం చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు.

మకరం: భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతారు. క్రయవిక్రయాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయ సంబంధిత చర్చలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.

కుంభం: ధన పరమైన ఇబ్బందులు కొంత చికాకు కలిగిస్తాయి. కుటుంబ విషయాలపై పెద్దలతో చర్చలు జరుపుతారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. చాలా కాలంగా వేచిచూస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు.

మీనం: చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Goddess Durga: దుర్గాదేవిని ఈ ఎర్రటి పూలతో పూజిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయ్ !

Sabarimala: శబరిమల అయ్యప్ప ఆలయంలో 4.54 కేజీల బంగారం మాయం..

Navratri Gifts Ideas: నవరాత్రి స్పెషల్.. బహుమతులు ఇచ్చే క్రీయేటివ్ ఐడియాస్ మీకోసం

Navratri Fasting: నవరాత్రి తొమ్మిది రోజుల ఉపవాస రహస్యాలు.. తెలుసుకోవాల్సిన ఆహార నియమాలు

Navratri Fashion Trends 2025: నవరాత్రి 2025.. తొమ్మిది రోజుల తొమ్మిది రంగుల ప్రత్యేకత

Solar Eclipse 2025: 21న ఆకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ రింగ్ ఆఫ్ ఫైర్!

Big Stories

×