E-Paper
Advertisement

Horoscope Today May 12th : ఇవాళ ఆ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది

Horoscope Today May 12th : ఇవాళ ఆ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మే 12న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు, లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది.

Advertisement

వృషభం: దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తి కావు.

మిధునం: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

Advertisement

కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం: బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి.

కన్య: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యా అనుకూలత కలుగుతుంది.

వృశ్చికం: సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రు సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

ధనస్సు: సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సంతానం విద్యా ఫలితాలు లాభిస్తాయి. దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి.

మకరం: రుణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది. బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు  ప్రతికూల పరిస్థితులుంటాయి.

కుంభం: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సోదర వర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి.

మీనం: అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ప్రయత్నాలు కలిసి రావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇంట్లో గందరగోళ వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×