Weekly Horoscope : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మే 04 నుంచి మే 10 వరకు ఏఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో నూతన ప్రణాళికలు చేసి విజయం సాధిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
వృషభం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు లేక స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి.
మిథునం: కొన్ని వ్యవహారాలలో చిన్నపాటి మార్పులు చేసి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు ధన సహాయం లభిస్తుంది. శత్రు సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. సోదరులతో ఆస్తి విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో వివాదాలు సద్దుమణిగి నూతన అవకాశాలు లభిస్తాయి.
కర్కాటకం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఉత్సాహం కలిగిస్తాయి. భూ సంబంధిత అమ్మకాల్లో అవరోధాలు తొలగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు తమ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
సింహం: చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత ఊరట కలిగించే సమాచారం తెలుస్తుంది. సోదరులతో వివాదాలకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి.
కన్య: వారం ప్రారంభంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబ సభ్యులు విభేదిస్తారు. క్రమక్రమంగా సమస్యలను అధిగమించి శుభ ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దశకు చేరుకుంటాయి. జీవిత భాగస్వామి సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?
తుల: మొండి బకాయిలు వసూలవుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలతో పనులు పూర్తిచేస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. రాజకీయ సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.
వృశ్చికం: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని బాధపడతారు. స్థిరాస్థి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వారం చివరన బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి.
ధనుస్సు: ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. గృహ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.
మకరం: నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ ఆలోచనలో ఇంటా బయట అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయట పడతారు. వ్యాపార వ్యవహారాల్లో బంధుమిత్రుల సలహాలు కలసివస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతారు.
కుంభం: అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. మిత్రులతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
మీనం: ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనల్లో నిలకడ లోపిస్తుంది. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. భూ సంభందిత క్రయ విక్రయాలు అంతగా అనుకూలించవు. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. మిత్రుల నుండి అందిన శుభవార్తలు కొంత ఆనందం కలిగిస్తాయి.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు