E-Paper
Advertisement

OTT Movie : వామ్మో ఇన్సూరెన్స్ పైసల కోసం సొంత చెల్లినే… ఈ ఖిలాడి లేడీ మామూలుగా లేదురా సామీ

OTT Movie : వామ్మో ఇన్సూరెన్స్ పైసల కోసం సొంత చెల్లినే… ఈ ఖిలాడి లేడీ మామూలుగా లేదురా సామీ
Advertisement

OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో కొన్ని సినిమాలు మంచి కిక్కెక్కించే స్టోరీలతో అదరగొడతాయి. చివరి వరకూ ట్విస్ట్ లతో టెన్షన్ పుట్టిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక మహిళ ఇన్సూరెన్స్ డబ్బు కోసం దిమ్మతిరిగి పోయే ప్లాన్ వేస్తుంది. ఆ తరువాత స్టోరీ ఆసక్తికరంగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

స్టెఫానీ స్మోతర్స్ అనే మహిళ భర్తను కోల్పోయి ఒక చిన్న పట్టణంలో నివశిస్తుంది. ఆమె వంటకాల గురించి వీడియోలు చేస్తూ ఉంటుంది. స్టెఫానీకి మైల్స్ అనే ఒక కొడుకు ఉంటాడు. ఒక రోజు మైల్స్ చదివే స్కూల్‌లో ఎమిలీ నెల్సన్ అనే గ్లామరస్, స్టైలిష్ మహిళను కలుస్తుంది స్టెఫానీ. ఎమిలీ ఒక ఫ్యాషన్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తుంది. ఆమె కొడుకు నిక్కీ, మైల్స్ కు స్నేహితుడు. ఇక స్టెఫానీ, ఎమిలీల మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది.

ఎమిలీ ఒక రోజు స్టెఫానీని తన కొడుకు నిక్కీని, స్కూల్ నుండి పిక్ చేసుకోమని ఒక సింపుల్ ఫేవర్ కోరుతుంది. కానీ ఎమిలీ ఆ తర్వాత కనిపించకుండా పోతుంది. రోజులు గడిచినా ఎమిలీ ఆచూకీ లభించకపోవడంతో, స్టెఫానీ ఆమె అదృశ్యం గురించి ఆరా తీయడం మొదలు పెడుతుంది. స్టెఫానీ డిటెక్టివ్‌లా ఎమిలీ గతాన్ని తవ్వడం స్టార్ట్ చేస్తుంది.

Advertisement

ఈ క్రమంలో ఎమిలీ గురించి షాకింగ్ రహస్యాలు బయటపడతాయి. ఎమిలీ అసలు పేరు ఫెయిత్ అని తెలుసుకుంటుంది. ఆమెకు హోప్ అనే ఒక సోదరి ఉందని, వారు చిన్నతనంలో తమ తండ్రిని చంపి పారిపోయారని తెలుస్తుంది. ఎమిలీ తన మరణాన్ని ఫేక్ చేసి, $4 మిలియన్ లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బు కోసం ప్లాన్ చేసినట్లు బయట పడుతుంది.

ఆమె తన సోదరిని చంపి, ఆ శవాన్ని తనదిగా చూపించి పోలీసులను మోసం చేస్తుంది. మరోవైపు స్టెఫానీ, ఎమిలీ భర్తతో సన్నిహితంగా మెలుగుతూ, ఎమిలీ రహస్యాలను కనిపెడుతుంది. చివరికి ఎమిలీ పోలీసులకు దొరికిపోతుందా ? ఆమెకు ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందా ? ఎమిలీ రహస్యాలను స్టెఫానీ ఎలా తెలుసుకుంటుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : రొమాన్స్ చేస్తూ మనుషుల్ని చంపే అమ్మాయి… అబ్బబ్బా ఏం బో*ల్డ్ సినిమారా బాబూ !

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఎ సింపుల్ ఫేవర్’ (A Simple Favor). 2018 లో వచ్చిన ఈ మూవీకి పాల్ ఫీగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2017 లో డార్సీ బెల్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో అన్నా కెండ్రిక్, బ్లేక్ లైవ్లీ, హెన్రీ గోల్డింగ్, ఆండ్రూ రానెల్స్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ యునైటెడ్ స్టేట్స్‌లో 2018 సెప్టెంబర్ 14న లయన్స్‌గేట్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి సీక్వెల్ ‘అనదర్ సింపుల్ ఫేవర్’ (Another Simple Favor),

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×