E-Paper
Advertisement

Today Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి బోలెడు ఊహించని లాభాలు..!

Today Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి బోలెడు ఊహించని లాభాలు..!

Today Astrology: పన్నెండు రాశుల్లో ఏ రాశి వారికి ఆదివారం అనుకూలంగా ఉంది? ఏ రాశి వారికి ఆదాయ మార్గాలు ఎలా ఉన్నాయి? ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? వంటి వివరాలను తెలుసుకుందాం.

మేషం:

మేష రాశి వారికి అద్భుతమైన కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు సఫలం అవుతాయి. ఆంజనేయస్వామివారిని దర్శించుకోవాలి.

వృషభం:

ఈ రాశి వారికి అనుకూలం. రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. ప్రారంభించిన పనుల్లో ఏకాగ్రత లోపించకూడదు. ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యానంతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

మిథునం:

మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇతరుల సహకారంతో పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అస్థిర బుద్ధితో ఇబ్బందులు ఎదురవుతాయి.  బంధువులు, మిత్రులలో భయభక్తులు మిమ్మల్ని ఉన్నతంగా ఉంచుతాయి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

Also Read: Gupt Navratri 2024: జూలై 6 తర్వాత విపత్తు వస్తుందా.. ?

కర్కాటకం:

ఈ రాశి వారికి అదృష్టకరం. వ్యాపారాల్లో ఆర్థిక సహకారాలు అందుతాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉండవచ్చు. సమాజంలో గౌరవం తగ్గకుండా చూసుకోవాలి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

సింహం:

సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. ఇతరుల సూచనలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. విష్ణుమూర్తిని ద్యానించండి.

కన్య:

ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులపై ఒత్తిడి ఉండవచ్చు.పనిలో ఏకాగ్రత లోపించకుండా పూర్తి చేస్తే విజయం వరిస్తుంది. విసుగు, చికాకు ప్రదర్శించే అవకాశం. ఆర్థికపరంగా పర్వాలేదు. శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. శివారాధనతో విజయాలు వరిస్తాయి.

Also Read: Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు..శనీశ్వరుడికి అభిషేకం చేయిస్తే మంచిది!

తుల:

తుల రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి పట్టిందల్లా బంగారం. ఏకాగ్రత లోపించకుండా పనిచేస్తే లాభాలు. ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు ఉంటాయి. రుణ విమోచన అంగారక స్తోత్రం చదవాలి.

వృశ్చికం:

ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. ఆలోచనలు వికసిస్తాయి. ప్రారంభించనున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అన్ని రంగాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలి.

ధనుస్సు:

ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచిగా వ్యవహరించాలి. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులు ఇతర సలహాలతో పనులు పూర్తి చేస్తారు.అనుకున్నది సాధిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు ఉంటాయి. హనుమాన్ చాలీసా చదవాలి.

Also Read: Yogini Ekadashi 2024: ఈ రోజున ఉపవాసం పాటిస్తే చనిపోయాక స్వర్గానికి వెళతారట

మకరం:

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దల సలహాలతో పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. శివారాధన శుభప్రదం.

కుంభం:

ఈ రాశి వారు మనోబంలో విజయాలు సాధిస్తారు. వ్యాపారం, వృత్తిపరంగా లాభం పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయులు సలహాలు పనిచేస్తాయి. ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. గణపతిని ధ్యానించండి.

మీనం:

మీనరాశి వారికి అనుకూలం. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలం. ముందుచూపుతో వ్యవహరించాలి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అభివృద్ధిలో ఏకాగ్రత లోపించవద్దు. గణపతి ఆలయాన్ని సందర్శించుకోవాలి.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×