BigTV English

Fasting on Yogini Ekadashi: ఈ రోజున ఉపవాసం పాటిస్తే చనిపోయాక స్వర్గానికి వెళతారట..!

Fasting on Yogini Ekadashi: ఈ రోజున ఉపవాసం పాటిస్తే చనిపోయాక స్వర్గానికి వెళతారట..!

Fasting on Yogini Ekadashi 2024: వేద క్యాలెండర్ ప్రకారం, విష్ణువుకు అంకితం చేయబడిన ఏకాదశి ఉపవాసం ప్రతి నెల శుక్ల, కృష్ణ పక్ష ఏకాదశి రోజున ఆచరిస్తారు. ఇక ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఈ మాసం విష్ణువు, శివుని ఆరాధనకు అంకితం చేస్తారు. ఆషాఢ కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథి నాడు యోగిని ఏకాదశి వ్రతం పాటిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. యోగిని ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఆచరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.


యోగిని ఏకాదశి తేదీ..

వైదిక క్యాలెండర్ ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తేదీ జూలై 1 ఉదయం 10:26 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి జూలై 2 ఉదయం 8:42 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, యోగిని ఏకాదశి వ్రతం 2 జూలై 2024 మంగళవారం నాడు ఆచరించి.. జూలై 3వ తేదీన విరమించాలి.


శుభ సమయం

యోగినీ ఏకాదశి వ్రతం రోజున త్రిపుష్కర యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయని పంచాంగంలో పేర్కొనబడింది. ఈ రోజున, ఈ రెండు యోగాలు ఉదయం 8:42 నుండి మరుసటి రోజు ఉదయం 4:40 వరకు ఉంటాయి. హిందూ మతంలో, ఈ రెండు కాలంలో చేసే పూజలకు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అలాగే ఏకాదశి వ్రతం రోజున అభిజిత్ ముహూర్తంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:55 మధ్య సమయం విష్ణువును పూజించడానికి చాలా శ్రేయస్కరం.

Also Read: Jagannath Rath Yatra 2024: జగన్నాథుడి రథయాత్ర కోసం చెక్కలను బంగారు గొడ్డలితో కోస్తారట..

ప్రాముఖ్యత

యోగినీ ఏకాదశి ఉపవాసం నిర్జల ఏకాదశి ఉపవాసం తర్వాత, దేవశయని ఏకాదశి ఉపవాసానికి ముందు ఆచరిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును సరిగ్గా ఆరాధించడం ద్వారా, ఒక వ్యక్తి ఆనందం, శ్రేయస్సు, సంపదను పొందుతాడు. అలాగే, ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఏకాదశి ఉపవాసం పాటించిన వారు మరణానంతరం స్వర్గానికి వెళ్తారని శాస్త్రంలో చెప్పబడింది.

Tags

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×