BigTV English
Advertisement

Today Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు.. శనీశ్వరుడికి అభిషేకం చేయిస్తే మంచిది..!

Today Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు.. శనీశ్వరుడికి అభిషేకం చేయిస్తే మంచిది..!

June 24th Horoscope: పన్నెండు రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం చేస్తే సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


మేషం:

మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు.కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంతో శుభ ఫలితాలు వెలువడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఆదాయం అంతంతమాత్రమే. బంధువులతో సంతోషంగా ఉంటారు. ఓపికతో పనులు పూర్తి చేసుకోవాలి ఆంజేయ ఆరాధన మంచిది.

వృషభం:

ఈ రాశి వారికి అనుకూలం. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. కుటుంబ సలహాలతో విజయం పొందుతారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివారాధన చేయాలి.


మిథునం:

మిథున రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో ఆచితూచిగా వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. శనీశ్వరుడికి అభిషేకం చేయిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు.

కర్కాటకం:

ఈ రాశి వారికి అనుకూలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారా రంగాల్లో అనుకున్న విజయం సాధిస్తారు. ఆనందంగా ఉంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దైవారాధన మానవద్దు.

సింహం:

సింహ రాశి వారికి తారాబలం మిశ్రమ ఫలితాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇతరుల సహకారం ఉంటుంది. కీలక పనుల్లో అప్రమత్తత అవసరం. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోపం ప్రదర్శించకుండా జాగ్రత్తగా సమయానుకూలంగా నడుచుకుంటే విజయం. విష్ణు సందర్శన శుభప్రదం.

కన్య:

ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రమ, ఒత్తిడి లేకుండా పనులు పూర్తిచేసుకోవాలి. అన్ని రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలకు అధిక ధనవ్యయం ఉండవచ్చు. శివస్తోత్రం పఠిస్తే మంచిది.

Also Read: Saturn: కుజుడిపై శని ప్రభావం.. జూలై 13 వరకు ఈ 5 రాశుల వారు జాగ్రత్త !

తుల:

తుల రాశి వారికి ప్రతికూల ఫలితాలు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అన్ని రంగాల వారికి పురోగతి ఉంటుంది. అధికారుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా లేదు. సమస్యలు ఎదురుకావొచ్చు. నీటి గండం ఉన్నందున దూరంగా ఉండాలి. హన్ మాన్ చాలీసా పారాయణంతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

వృశ్చికం:

ఈ రాశి వారికి అనుకూలం. ప్రారంభించిన పనుల్లో ఆటంకం రాకుండా చూసుకోవాలి. వ్యాపారాల్లో అనుకున్నది పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. సూర్యారాధనతో ఉత్తమ ఫలితాలు రావొచ్చు.

ధనుస్సు:

ఈ రాశి వారికి సామన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా లాభాలు ఉండకపోవచ్చు. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఇష్టదైవాన్ని పూజించాలి.

Also Read: Jagannath Rath Yatra 2024: జగన్నాథుడి రథయాత్ర కోసం చెక్కలను బంగారు గొడ్డలితో కోస్తారట..

మకరం:

మకర రాశి వారికి అనుకూలం. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలక పనుల్లో విజయం పొందుతారు. సమయానికి నిద్ర అవసరం. ప్రయాణాలు ఉంటాయి. వృథా ఖర్చులపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది. గణపతి ప్రార్థన చేయాలి.

కుంభం:

ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది. ముఖ్యమైన విషయాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. మీ రంగాల్లో శుభవార్త వింటారు. కీలక పనుల్లో ఇబ్బందులు ఎదురైనా పూర్తి చేస్తారు. సమాజంతో ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదైవారాధన మంచిది.

మీనం:

ఈ రాశి వారికి అనుకూలం. కొత్త పనులు ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొన్ని పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. బంధు మిత్రులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. శివారాధన చేయాలి.

Related News

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Big Stories

×