BigTV English

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి మనశ్శాంతికి భంగం!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి మనశ్శాంతికి భంగం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం 12 రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంది? పనులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయా? ధన లాభం పొందాలంటే ఎలాంటి పనులు చేయాలనే విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. వ్యాపారాల్లో ఆర్థికంగా లాభం పొందుతారు. సంపద పెరగడంతో మనశ్శాంతిగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. లింగాష్టకం చదవాలి.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. సమయానుకూలంగా వ్యవహరిస్తే ఫలితం ఉంటుంది. కీలక పనులకు ఆటంకం లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పనుల్లో శ్రమ పెరుగుతుంది. కలత పెట్టే సంఘటనలు ఎదురవుతాయి. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ సందర్శనం ఉత్తమం.


మిథునం:
ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. కొత్త పనులు మొదలు పెడుతారు. బంధువులను కలుస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశి వారు ఇతరులతో అప్పు తీసుకోకపోవడం ఉత్తమం. గొడవలకు అవకాశం ఉంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదవాలి.

కర్కాటకం:
ఈ రాశి వారు అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార సంబంధ విషయాల్లో గుడ్డిగా నమ్మకూడదు. ఆచితూచిగా వ్యవహరించాలి. లేదంటే భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శని శ్లోకం చదివితే మంచిది.

సింహం:
ఈ రాశి వారికి అనుకూలం. మీ పనుల్లో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పెద్దల సలహాలు పనిచేస్తాయి. బంధువులతో ఆచితూచి మాట్లాడాలి. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.

కన్య:
కన్య రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. కీలక నిర్ణయాలతో సమస్యలు రావొచ్చు. ఒత్తిడి పెరగడం, అనవసర ఖర్చులు ఉంటాయి. కీలక పనులు పూర్తి కాకపోవడంతో ఆందోళన చెందుతారు. దుర్గాధ్యానం చేయడంతో సమస్యలు తీరుతాయి.

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. దైవబలంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరమైన విషయాల్లో నిజాయితీగా ఉండాలి. కుటుంబ సభ్యులతో వివాదం తలెత్తవచ్చు. ఈశ్వర ధ్యానం శుభదాయకం.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి. ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాల్లో మార్పులు అవసరం. ఆర్థికంగా లాభాలు పొందుతారు. దైవారాధన ఉంటే మంచిది.

ధనుస్సు:
ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉండాలి. కీలక సమయాల్లో చేతికి డబ్బు అందుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా చదవాలి.

మకరం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. స్నేహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని పరిచయాలతో మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కీలక సమయాల్లో ఆలోచించి వ్యవహరించాలి. లేదంటే భారీగా నష్టపోతారు. సూర్య ఆరాధన మంచిది.

కుంభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంది. సకాలంలో పనులు పూర్తి చేయడంతో ప్రశంసలు పొందుతారు. అలసట పెరుగుతుంది. ఇతరుల సలహాలు పనిచేస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.

మీనం:
మీన రాశి వారు కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. మీ పని విషయంలో అధికారులు సంతృప్తిపడకపోవచ్చు. గొడవలకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో లాభాలు వరిస్తాయి. అభివృద్ధి చెందడంతో ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

Related News

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Big Stories

×