E-Paper
Advertisement

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అత్యంత అద్భుతం.. వివాహయోగం!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అత్యంత అద్భుతం.. వివాహయోగం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఏ రాశి వారికి వివాహ యోగం ఉందనే విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది.  ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వరిస్తాయి. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.పెద్దల సలహాలు పనిచేస్తాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యో, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.శ్రీలక్ష్మీ అస్టోత్తర శతనామావళి చదివితే మంచిది.

మిథునం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అత్యంత అద్భుతంగా ఉంటుంది. వివాహ యోగం ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. గోవిందనామాలు చదివితే బాగుంటుంది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. సమయం వృథా కాకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధువులతో సంతోషంగా ఉంటారు. సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు ఊహించని లాభాలు వరిస్తాయి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులకు గురిచేస్తాయి. అనవసరం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కొన్ని సంఘటనలు బాధను గురి చేస్తాయి. శనిధ్యానం చదవాలి.

కన్య:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారులకు మంచి లాభాలు వరిస్తాయి. పెండింగ్ బకాయిలు వసూలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్, పురోగతి ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులకు కలిసి వస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. ప్రయాణాలు ఉంటాయి. సమయానికి డబ్బు అందుతుంది. ఇష్టదైవాన్ని స్మరించుకుంటే మంచి జరుగుతుంది.

వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. ప్రారంభించిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురుకొవొచ్చు. ఆదాయం అంతంతమాత్రమే ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు అనుకూలించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చంద్రధ్యానం చేసుకోవాలి.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో సులువుగా విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే శుభప్రదం.

మకరం:
మకర రాశి వారికి శుభకాలం. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తోటివారి సహకారంతో విజయం పొందుతారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు రద్దు చేసుకోవడం ఉత్తమం. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.

కుంభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో విజయం పొందుతారు. అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయాన్ని మంచి ఖర్చులు ఉంటాయి. ఇతరులతో విభేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరించాలి. నవగ్రహ శ్లోకం చదవాలి.

మీనం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వివాహం కాని వారికి వివాహయోగం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలించవచ్చు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×