Tirumala Darshan: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి ఉదయం 8 గంటల తరువాత వెళ్లే భక్తులకు సుమారు 22 గంటల సమయం పడుతుంది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శన టోకెన్ పొందిన భక్తులకు 5–7 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,020 కాగా.. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,609 గా నమోదైంది. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4.19 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Also Read : Bigg Boss Agnipariksha: నాలో స్వీట్ చాక్లెట్ బాయ్ నే చూశారు… భయపెడుతున్న అభిజిత్
క్యూలైన్లలో ఉన్న భక్తుల రద్దీని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి తోపులాటలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. వసతి కోసం రద్దీ పెరగడంతో గదులు అందుబాటులో లేని భక్తులకు యాత్రికుల వసతి సముదాయాల్లో సేద తీరుతున్నారు. మరి కొందరు తిరుమల వ్యాప్తంగా ఉన్న షెడ్లు,జర్మన్ షెడ్లలో ఉంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా రెండు రోజులు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Also Read :LIC Notification: ఎల్ఐసీలో 491 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. రూ.1,69,025 వేతనం
స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా 3 రోజులు (15, 16, 17) సెలవులు రావడంతో పిల్లలు, పెద్దలు శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో వస్తున్నారు. భక్తుల రద్దీ ఒక్కసారి పెరగడంతో అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టారు. ఒక వైపు వానలు మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో, తిరుమల భక్తులతో కిటకిట లాడుతోంది. ఇవాళ, రేపు తిరుమలలో భక్తులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ యాంత్రంగం తెలిపారు.