Singer Zubeen Garg:ఎవరైనా చనిపోతే వారిది సహజ మరణమా.. లేక అనుమానాస్పదంగా చనిపోయారా ? అని పోలీసులు ఇట్టే పసిగడతారు. కొన్ని కొన్ని సార్లు చనిపోయి అన్ని కార్యక్రమాలు అయిపోయాక కూడా ఇంట్లో వాళ్ళ ప్రవర్తన బాలేక పోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్నో నిజాలని బయటపెడతారు. అలా సామాన్యుల విషయంలోనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడంలో ముందుంటారు. ఇక సెలబ్రెటీల అనుమానాస్పద మృతి అంటే ఊరికే వదిలేయరు కదా. తాజాగా అస్సాంకి చెందిన గాయకుడి మృతిపై పోలీసులు ఆరా తీస్తూ సంచలన విషయాలు బయటికి తీస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా అస్సాంకి చెందిన దివంగత పాప్ సింగర్ జుబీన్ గార్గ్ మేనేజర్ ని పోలీసులు అరెస్టు చేశారు. మరి జుబీన్ గార్గ్ ది సహజ మరణం కాదా..ఆయన్ని ఎవరైనా చంపేశారా.. ? మేనేజర్ ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అస్సాం కి చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియక పోయినప్పటికీ అస్సాంలో ఆయన చాలా పాపులర్ సింగర్.ఈయన 40కి పైగా భాషల్లో పాటలు పాడారు. కేవలం సింగర్ గానే కాకుండా హీరోగా..డైరెక్టర్ గా.. రచయితగా.. మ్యూజిక్ డైరెక్టర్గా..పలు విభాగాల్లో కూడా పనిచేశారు. అయితే అలాంటి జుబీన్ గార్గ్ తండ్రి కవి,తల్లి గాయని కావడంతో చిన్నప్పటినుండే సినిమాల మీద, పాటల మీద ఇంట్రెస్ట్ తో సింగర్ గా ఎదిగారు.అలాగే ప్రముఖ సంగీత కళాకారుడు జుబీన్ మెహతా అంతటి స్థాయికి తమ కొడుకు ఎదగాలనే ఉద్దేశంతో ఈ సింగర్ తల్లిదండ్రులు జుబీన్ గార్గ్ అని నామకరణం చేశారు. అలాంటి జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతి అస్సాం సినీ ప్రేక్షకులని కన్నీరు పెట్టిస్తోంది.
ALSO READ:Bigg Boss 9 Promo: గోల్డెన్ ఆపర్చునిటీ.. పాపం ఆ కంటెస్టెంట్ బలి!
జుబీన్ గార్గ్ మరణంపై అనుమానాలు..
విషయంలోకి వెళ్తే.. జుబీన్ గార్గ్ రీసెంట్ గా సింగపూర్ లో జరిగిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ లో ప్రదర్శన ఇవ్వడం కోసం వెళ్ళాడు.. అలా సింగపూర్ కి వెళ్ళిన జుబీన్ గార్గ్ సముద్రలో స్కూబా డైవింగ్ చేయడం కోసం సెప్టెంబర్ 19న అక్కడికి వెళ్ళాడు. కానీ అదే రోజు ప్రమాదశాత్తు ఆయన సముద్రంలో పడి మరణించారు. నిజానికి అక్కడ సిబ్బంది ఆయనను వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తరలించినా.. అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వాస్తవానికి సముద్ర యానానికి వెళ్లిన జుబీన్ గార్గ్ ఒంటిపైన లైఫ్ జాకెట్ లేకపోవడంతో ఈయన ప్రమాదవశాత్తు చనిపోలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే జుబీన్ గార్గ్ మరణానికి గల కారణాలు తెలుసుకోవడం కోసం ఇప్పటికే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వాహకుడు అయినటువంటి శ్యాంకను మెహతాను న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అరెస్టు చేశారు.
జుబీన్ గార్గ్ మేనేజర్ అరెస్ట్..
అలాగే జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మని గురుగ్రామ్ లో ఆయన ఉండే అపార్ట్మెంట్లో అరెస్టు చేసి విచారణ కోసం గౌహతికి తీసుకు వెళ్లినట్టు సీనియర్ పోలీస్ అధికారి మీడియా ముందు బయట పెట్టారు. అలా ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ మృతికి సంబంధించి సింగపూర్ ఈవెంట్ కి వెళ్ళాక అక్కడ ఏం జరిగింది అనే విషయాలని పోలీసులు విచారించబోతున్నారు. ఇక ఇప్పటికే సింగర్ మృతిపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన మృతికి కారణమైన వారిని వదిలిపెట్టేదే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక జుబిన్ గార్గ్ ది సహజ మరణమా.. కాదా..అని పోలీసులు విచారణ చేపట్టారు.