Bigg Boss Agnipariksha: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమానికి తెలుగులో ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం 8 సీజన్లను పూర్తి చేసుకుని త్వరలోనే తొమ్మిదవ సీజన్ ప్రారంభం కాబోతోంది. అయితే తొమ్మిదవ సీజన్లో భాగంగా కామన్ మ్యాన్ (Common Man)ఎంట్రీ కూడా ఉండబోతున్న నేపథ్యంలో కామన్ మ్యాన్ క్యాటగిరి లో భాగంగా కంటెస్టెంట్ లను ఎంపిక చేయడం కోసం అగ్ని పరీక్ష(Agnipariksha) అనే షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన వారిని బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్లుగా పంపించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమం ఆగస్టు 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది.
ఒక్కసారి కమిట్ అయితే పని అయిపోయినట్టే..
ఈ అగ్ని పరీక్ష కార్యక్రమానికి గత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ లను జడ్జిగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా నిలిచిన అభిజిత్ (Abhijeet )తో పాటు బిందు మాధవి(Bindu Madhavi), నవదీప్(Navadeep) ఈ అగ్ని పరీక్ష కార్యక్రమానికి జడ్జెస్ గా ఉండబోతున్నారు. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో ని విడుదల చేశారు. ఇందులో భాగంగా అభిజిత్ మాట్లాడుతూ.. “సెట్ బాగుంది అయినా ఫైటింగ్ చేయాలంటే ఈ మాత్రం ఉండాలిలే అంటూ మాట్లాడుతుండగా వెంటనే బిగ్ బాస్ తనకు స్వాగతం పలుకుతారు. అభిజిత్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి తాను కంటెస్టెంట్ గా వచ్చానని ,అయితే ఇప్పుడు ఒక జడ్జిగా పిలిచారు థాంక్యూ అంటూ చెప్పడంతో అవన్నీ తర్వాత ముందు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేయాలి గుర్తుందా?అంటూ ప్రశ్నిస్తారు. ఆ గుర్తుంది బిగ్ బాస్ నా గురించి తెలుసు కదా ఒకసారి కమిట్ అయితే ఇక పని అయిపోయినట్టే” అంటూ అభిజిత్ చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడారు.
నా జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చూపిస్తా…
“ఈ సారీ నీ పని అయిపోతుంది.. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నావు అగ్నిపరీక్షకు సిద్ధంగా ఉండు” అంటూ బిగ్ బాస్ చెబుతారు. దీంతో అభిజిత్.. “ఇప్పటి దాక నాలో ఒక స్వీట్ చాక్లెట్ బాయ్ ని మాత్రమే చూశారు.. ఈ ఆగస్టు 22వ తేదీ నుంచి నా జడ్జిమెంట్ ఎంత టఫ్ ఉంటుందో వాళ్లకి చూపిస్తా.. బిగ్ బాస్ కి కూడా చూపిస్తా” అంటూ చెప్పిన ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమో చూస్తుంటే మాత్రం నిజంగానే కామన్ మ్యాన్ ఎంట్రీ లో భాగంగా సెలెక్ట్ అయిన వారికి అగ్నిపరీక్ష అని స్పష్టం అవుతుంది.
ఇక ఈ కార్యక్రమం 22వ తేదీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ అగ్ని పరీక్షలో భాగంగా సామాన్యులకు ఎలాంటి టాస్కులు ఇవ్వబోతున్నారు ఏంటి అనే విషయాలు తెలియనున్నాయి. ఈ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన వారు తిరిగి బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారు. అయితే ఎప్పుడు లేని విధంగా ఈసారి డబుల్ హౌస్, డబుల్ డోస్.. అందరి సరదాలు తీరిపోతాయి అంటూ నాగార్జున (Nagarjuna)కూడా ఇటీవల ఓ ప్రోమో ద్వారా చేస్తున్న ఈ కామెంట్స్ చూస్తుంటే ఈసారి ఈ సీజన్ సరికొత్తగా ఉండబోతుందని స్పష్టం అవుతుంది. అలాగే టాస్కులు కూడా చాలా కష్టంగా ఉండబోతున్నాయని టాస్కులలో గెలవాలంటే యుద్ధాలు చేయాల్సిందేనని నాగార్జున తెలియజేస్తూ వస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు గురించి కూడా రోజు ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
Also Read: Udaya Bhanu: రియాలిటీ షోలు పెద్ద మోసం… బండారం బయటపెట్టిన ఉదయ భాను