LIC Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, లా డిగ్రీ, సీఏ, ఐసీఏఐ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, దరఖాస్తు విధానం గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారత ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ).. 491 పోస్టులతో అసిస్టెంట్ ఇంజినీర్స్ (ఏఈ- సివిల్/ఎలక్ట్రికల్), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏఏఓ- స్పెషలిస్ట్) నియామకాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెప్టెంబర్ 8న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 491
ఎల్ఐసీలో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజినీర్స్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
అసిస్టెంట్ ఇంజినీర్ : 81 పోస్టులు
ఏఈ (సివిల్)- 50
ఏఈ (ఎలక్ట్రికల్)- 31
కేటగిరీల వారీగా
ఎస్సీ: 12
ఎస్టీ: 6
ఓబీసీ: 21
ఈడబ్ల్యూఎస్: 21
యూఆర్: 34
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 410 పోస్టులు
ఏఏఓ (సీఏ)- 30
ఏఏఓ (సీఎస్)- 10
ఏఏఓ (యాక్యూరియల్)- 30
ఏఏఓ (ఇన్యూరెన్స్ స్పెషలిస్ట్)- 310
ఏఏఓ (లీగల్)- 30
కేటగిరీ వారీగా..
ఎస్సీ: 58 పోస్టులు
ఎస్టీ: 29 పోస్టులు
ఓబీసీ: 100 పోస్టులు
ఈడబ్ల్యూఎస్: 44 పోస్టులు
యూఆర్: 179 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, లా డిగ్రీ, సీఏ, ఐసీఏఐ పాసై ఉండాలి. అలాగే సంబంధిత పోస్టుకు వర్క్ ఎక్స్ పీరియన్స్, ఐసీఎస్‌ఐ మెంబర్ అయి ఉంటేసరిపోతుంది.
ముఖ్యమైన డేట్స్..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 16
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 8
ప్రిలిమనరీ ఎగ్జామ్: 2025 అక్టోబర్ 3
మెయిన్స్ ఎగ్జామ్: 2025 నవంబర్ 8
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 ఆగస్టు 1 నాటికి ఏఈ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఏఏఓ సీఏ, లీగల్ పోస్టులకు 21 నుంచి 32 ఏళ్ల వయస్సు ఉండాలి. ఇతర పోస్టులకు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులకు ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది.
వేతనం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.88,635 నుంచి రూ.1,69,025 వేతనం ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఉద్యోగ ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్- ఆబ్జెక్టివ్), మెయిన్ (ఆబ్జెక్టివ్ + డిస్క్రిప్టివ్), ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.85 ఫీజు ఉంటుంది. ఇతరులకు రూ.700 ఫీజు ఉంటుంది.