BigTV English

Navaratri 2024: నవరాత్రుల్లో ఈ వస్తువులు దానం చేస్తే.. కోరిన కోరికలు నెరవేరతాయ్

Navaratri 2024: నవరాత్రుల్లో ఈ వస్తువులు దానం చేస్తే.. కోరిన కోరికలు నెరవేరతాయ్

Navaratri 2024: నవరాత్రులు నేటి నుండి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 12న దేవీ నవరాత్రులు ముగుస్తాయి. నవరాత్రులలో 9 రోజులు, దుర్గాదేవి యొక్క 9 రూపాలను వివిధ ఆచారాలతో పూజిస్తారు. నవరాత్రుల మొదటి రోజు నుంచి దేశ వ్యాప్తంగా అమ్మవారిని ప్రతిష్టలు, పూజలు కొనసాగుతాయి. దీంతో పాటు కలశ స్థాపన కూడా చేస్తారు.


హిందూ మతంలో, ప్రతి పండుగకు ఏదైనా దానం చేసే సంప్రదాయం ఉంటుంది. నవరాత్రులలో వస్తువులను దానం ఇవ్వడం ద్వారా దుర్గా దేవి ప్రసన్నులవుతారని అంతే కాకుండా తన భక్తులకు దీవెనలు ప్రసాదిస్తుందని నమ్ముతారు. అమ్మవారి అనుగ్రహం కోసం నవరాత్రులలో ఏయే వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతే కాకుండా వస్తువులను దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం.

నవరాత్రులలో ఈ వస్తువులను దానం చేయండి:


కొత్త బట్టలు:
మత విశ్వాసాల ప్రకారం, నవరాత్రి రోజున కొత్త బట్టలు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కొత్త బట్టలు దానం చేయడం వల్ల దుర్గామాత ఎంతో సంతోషిస్తుందని నమ్ముతారు. అంతే కాకుండా ఇలా దానం ఇవ్వడం వల్ల అన్ని బాధలను తొలగిపోతాయి.

ఎర్రటి గాజులు:
నవరాత్రులలో ఎర్రటి గాజులు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పెళ్లయిన స్త్రీలు నిండుగా భక్తితో ఎర్రటి గాజులను దానం చేస్తే వారికి శుభం కలుగుతుందని నమ్మకం. అదే సమయంలో అమ్మవారు సంతోషంగా ఉంటుందని చెబుతారు.

పుస్తకాలు:
నవరాత్రులలో నిస్సహాయ పిల్లలకు పుస్తకాలను దానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నవరాత్రులలో నిస్సహాయులైన పిల్లలకు విద్యారంగంలో సహాయం చేయడం జీవితంలో ఏ విధమైన దుఃఖాన్ని కలిగించదని నమ్ముతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని చెబుతారు.

Also Read: నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా ? ఈ 6 విషయాలు తప్పక గుర్తుంచుకోండి

అరటిపండు:
నవరాత్రులలో అరటిపండు దానం చేయాలి. ఈ సమయంలో అరటిపండును దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. మత విశ్వాసాల ప్రకారం, నవరాత్రులలో పేదలకు లేదా బ్రాహ్మణులకు అరటిపండును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి.

యాలకులు దానం:
దుర్గామాతకి యాలకులు అంటే చాలా ఇష్టం. అందువల్ల నవరాత్రులలో యాలకులు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో యాలకులు దానం చేయడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ , ఆదాయం కూడా పెరుగుతుందని నమ్ముతారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×