BigTV English

Marriage: రూ.3 లక్షలిచ్చి పెళ్లి చేసుకున్న ఘనుడు.. శోభనం మాటే లేదు కానీ కట్ చేస్తే…

Marriage: రూ.3 లక్షలిచ్చి పెళ్లి చేసుకున్న ఘనుడు.. శోభనం మాటే లేదు కానీ కట్ చేస్తే…

Marriage: పెళ్లి కాలేదనుకున్నాడు.. బాధ పడ్డాడు.. కుమిలి పోయాడు.. చేసేదేమి లేక పెళ్లిళ్ల బ్రోకర్ వద్దకు వెళ్ళాడు.. తియ్యని మాటలు నమ్మాడు.. చివరికి పెళ్లైంది.. కానీ ఆ ఒక్కటీ జరగలేదు… బాధ పడ్డాడు.. ఇంకా కుమిలి పోయాడు.. చివరకు అయ్యా… మోసపోయాను అంటూ ఆర్తనాదాలు పెడుతున్నాడు..పెళ్లైనా శోభనం కానీ ఈ నవ వరుడు. ఇంతకు ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో …


పెళ్లి చేసుకొనే సమయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడమంటారు మన పెద్దలు. కానీ నేటి రోజుల్లో అలనాటి పద్ధతులకు స్వస్తి పలికి.. మై తుమ్ సే ప్యార్ కర్తాహు అనడం.. లేకుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా.. నిన్ను పెళ్లి చేసుకుంటా .. అనడం.. తీరా పెళ్లయ్యాక కుయ్యో మొయ్యో అనడం నేటి రోజుల్లో కామన్ గా మారింది. అందరూ కాకున్నా..ఎక్కువ మోతాదులో ఇటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డి వయస్సు 40 ఏళ్లు. అయితే పెళ్లి కాలేదు.. పాపం దిగాలు పడ్డాడు.. తనకు తెలిసిన పెళ్లిళ్ల బ్రోకర్ నీ కలిశాడు. ఆ మ్యారేజ్ బ్రోకర్ తెచ్చిన సంబంధం చూసి వెనుకా.. ముందు ఆలోచించకుండా.. ఎటువంటి వివరాలు తెలుసుకోకుండా.. ఆతురతగా పెళ్లి చేసుకున్నాడు వేమారెడ్డి. 12 రోజులు గడిచింది. అయినా ఆ ఒక్క శుభం జరగలేదు. అదేనండీ శోభనం. మనోడు శోభనం అనడం.. ఆమె మాట దాటేయడం. ఇలా రోజులు గడుస్తున్నాయి.


Also Read: Big Tv Special : ఏదైనా రెండు రోజులు కొత్త ఇష్యూ వస్తే అంతా మామూలే

కాగా పెళ్లికి ముందు తనకు ఎవరూ లేరని చెప్పిన ఆ నవ వధువు ఒక్కసారిగా మా నాన్న చనిపోయారు అంటూ బాంబ్ పేల్చింది. దీనితో నివ్వెరపోయిన మనోడు.. చనిపోయిన నాన్నకు ఆరోగ్యం బాగాలేదు అంటావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక మహిళ పూర్తి రివర్స్ లో ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించగా.. వేమారెడ్డి మిన్నకుండి పోగా.. ఆమె ఆటోలో వెళ్లి పోయింది. ఇక ఎన్ని రోజులైనా వెనక్కు రాలేదు.
అయితే తనతో ఒకసారి భీమవరంలో మా ఇల్లు ఉందంటూ మహిళ చెప్పిన మాటలు అతడికి గుర్తుకు వచ్చాయి. ఆమె ఫోటో తీసుకొని ఊరంతా తిరిగాడు. తనకు సంబంధం తెచ్చిన పెళ్లి బ్రోకర్ కు ఫోన్ చేసినా స్పందన లేదు.

గ్రామాలన్నీ తిరిగి తిరిగి డబ్బులు ఖర్చు చేసుకున్న వేమారెడ్డి.. చివరకు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. అందుకే స్వామీ.. పెద్దలు చెప్పిన మాటలు వినండి.. పెళ్లి చేసుకొనే ముందు అన్నీ విచారించుకోండి.. తన మాదిరిగా మాత్రం కావద్దు అంటూ ప్రకటన ఇచ్చేశాడు వేమారెడ్డి. అందుకే యూత్.. వేమారెడ్డి మాట కూడా వినండయ్యా ఒకసారి !

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×