BigTV English

Raksha Bhandan 2024: రాఖీ పండగ రోజు ఈ పూజ చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయ్

Raksha Bhandan 2024: రాఖీ పండగ రోజు ఈ పూజ చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయ్

Raksha Bhandan 2024: శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ పండగను జరుపుకుంటాము. అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమకు గుర్తుగా ఈ పండగను జరుపుకుంటారు. ఈ సారి రాఖీ పండగను ఆగస్టు 19 తేదీన జరుపుకోనున్నాము. శ్రావణ పౌర్ణమి తర్వాత భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది. రక్షా బంధన్ రోజు సోదరి సోదరుడి మణికట్టుకి రాఖీ కట్టి అతడిని దీర్ఘాయువుతో ఉండాలని కోరుకుంటుంది సోదరి. ఈ రోజున నుదుటిన తిలకం పెట్టి రాఖీని కడతారు. బదులుగా సోదరుడు తన సోదరిని కాపాడతానని, తన శక్తి మేరకు అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అయితే రక్షా బంధన్ ఎప్పుడు ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన అనేక కథలు కూడా అందుబాటులో ఉన్నాయి.


భారత దేశంలో రాఖీ పండగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది సంబంధాలలో మాధుర్యాన్ని , నమ్మకాన్ని, ప్రేమను పెంచే పండగగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు అనేక శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇది రాఖీ పండగను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఈ ఏడు సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, వైభవ యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాల్లో రాఖీ కట్టడం వల్ల సోదరుల పురోగతిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. సోదర సోదరీమణులు అందరూ ఏ సమయంలో రాఖీ కట్టాలి, రాఖీ కట్టే సరైన సమయంతో పాటు చేయాల్సిన పూజల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

రాఖీ కట్టే విధానం: రాఖీ పండగ రోజు రాఖీ కట్టే ముందు ముందుగా ప్లేట్ ను అలంకరించాలి. దాని తర్వాత అందులో మీరు రాఖీ మరియు స్వీట్లను ఉంచాలి. ఈ సమయంలో దీపం కూడా వెలిగించాలి. ముందుగా సోదరుడికి తిలకం పెట్టాలి. ఆ తర్వాత కుడి చేతికి రాఖీ కూడా కట్టాలి. మూడు ముడులతో రాఖీ కట్టాలి. రాఖీ యొక్క ఈ ముడులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంబంధించినవిగా నమ్ముతారు. ఆ తర్వాత సోదరుడికి స్వీట్లు తినిపించాలి. ఆ తర్వాత సోదరులకు హారతి ఇచ్చి వారి దీర్ఘాయువు, సంతోషకరమైన జీవితాన్ని కోరుకోండి.


Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×