BigTV English

Hanuman Jayanthi 2024: నేడు హనుమాన్ జయంతి.. ఇలా చేశారంటే మీ అప్పుల బాధలు తీరినట్లే..

Hanuman Jayanthi 2024: నేడు హనుమాన్ జయంతి.. ఇలా చేశారంటే మీ అప్పుల బాధలు తీరినట్లే..

Hanuman Jayanthi 2024: నేడు హనుమాన్ మందిరాల్లో హనుమాన్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథిలోని హనుమాన్ జయంతిని భక్తులు ఎంతో భక్తి, శ్రద్ధలతో పాటిస్తారు. జూన్ 1వ తేదీ అంటే ఈరోజు ఉదయం 7.24 గంటలకు ప్రారంభమైన హనుమాన్ జయంతి దివ్య గడియలు రేపు అంటే జూన్ 2వ తేదీ ఉదయం 5.04 గంటల వరకు ఉండనుంది. ఇది దశమి తిథి ఆధ్యాత్మిక శక్తిగా పరిగణిస్తారు. 41 రోజుల పాటు హనుమాన్ దీక్షను కొనసాగించిన భక్తులు.. కాలి నడకన చెప్పులు లేకుండా వెళ్లి హనుమాన్‌ను దర్శించుకుంటారు.


వరాలను పొందేందుకు శుభప్రదం..

ఈ ఏడాది వచ్చిన హనుమాన్ జయంతి చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహాల స్థానాలు అనూకులంగా ఉండడంతో అడ్డంకులు తొలగించి, స్థిరమైన శ్రేయస్సును పొందేందుకు భక్తుకలు భజరంగబళి వరాలు కురిపించనున్నాడు. హనుమంతుడిని భక్తి, శ్రద్ధలతో కొలిచే 41 రోజుల దీక్షకు పూర్ణిమ లేదా చైత్ర పూర్ణిమ తిథి సూర్యచంద్రుల కలయికతో వస్తుంది. ఇది అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. అంతేకాదు ఇది దైవ శక్తుల ఆశీర్వాదాలు, శరీరం, ఆత్మ ఆధ్యాత్మిక ప్రక్షాళన, మనస్సును ప్రక్షాళనం చేయనుంది. దీక్షను ప్రారంభించిన సమయం నుంచి దీక్షను విరమించే 41వ రోజున హనుమాన్ జయంతిని వేడుకగా జరుపుకుంటారు.


ఇలా చేస్తే అప్పుల బాధ పోతుంది

హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయస్వామిని భక్తులు ఎన్నో కోరికలు కోరుకుంటుంటారు. అయితే ఈ రోజు చేసే పూజల కారణంగా హనుమంతుడి ఆశీస్సులు అందుకోవచ్చు. వ్యాపారంలో విజయం, అప్పుల బాధ నుంచి బయటపడాలంటే ఎర్రటి సింధూరాన్ని ఆంజనేయస్వాడికి సమర్పించాలి. రామ్ రామ్ రామ్ అనే మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. పెళ్లి కాని వారు హనుమంతుడి ఆశీస్సుల కోసం సుందర కాండ పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల వివాహంలో అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయి.

Tags

Related News

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×