BigTV English

Team India: ఆ ఒక్కడే టీమ్ ఇండియా బలమా?

Team India: ఆ ఒక్కడే టీమ్ ఇండియా బలమా?

Is Surykumar Yadhav is the only strength of Team India: టీ 20 ప్రపంచకప్ సమరం ప్రారంభం కావడానికి మరొక్క రోజు సమయం ఉంది. జూన్ 2న అమెరికా వర్సెస్ కెనడా మధ్య మొదటి మ్యాచ్ అమెరికాలోని డల్లాస్ లో జరగనుంది. అలాగే వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూ గనియా మధ్య మ్యాచ్ వెస్టిండీస్ లోని గయానాలో జరగనుంది.


మరో మూడు రోజుల తర్వాత జూన్ 5న టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడనుంది. ఇప్పుడు టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్లు అందరిలో ఒక్కడే టీమ్ ఇండియా గుండెకాయలా కనిపిస్తున్నాడు. అతనే మిస్టర్ 360 డిగ్రీలుగా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్..

ఉదాహరణకి ఓపెనర్ గా వచ్చే రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ ఆడినా చాలు. మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. అలాగే అతనికి తోడుగా మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ చిచ్చరపిడుగులాంటి వాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే, తన వికెట్ తీయడం చాలా కష్టమని చెప్పాలి. ఇక ఫస్ట్ డౌన్ లో వచ్చే టీమ్ ఇండియా మూలస్తంభం విరాట్ కొహ్లీ ఒక్కడు చాలు కొండలా నిలబడిపోతాడు.


Also Read: టీమ్ ఇండియా..పేస్ బౌలింగు వీక్ గా ఉందా?

వీరందరి తర్వాత అప్పుడొస్తాడు.. సూర్యకుమార్ యాదవ్.. తను వీరు చేసిన పరుగులను టాప్ రేంజ్ లోకి తీసుకువెళ్లి వదులుతాడు. తన తర్వాత రిషబ్ పంత్ వస్తాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వస్తాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా లేదా శివమ్ దూబె వస్తారు. అందరూ వరుసపెట్టి హార్డ్ హిట్టర్లే ఉన్నారు. కానీ వీరందరిలో స్పెషల్ ఎవరంటే సూర్యకుమార్ యాదవ్ అని చెప్పాలి. ఎందుకంటే తనే టీమ్ ఇండియాకి వెన్నుముక అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే తను బలమైన జట్లతో ఆడేటప్పుడు త్వరగా అవుట్ అయిపోతాడనే పేరుంది. అంతేకాదు స్లో పిచ్ లపై ఆడలేడని, అలాగే బౌలర్లు ఏ మాత్రం బాల్ స్లో గా వేసినా, తను బ్యాట్ ని స్పీడుగా విదిలించి, త్వరగా అవుట్ అయిపోతాడని అంటున్నారు. మరి వీటన్నింటిని అధిగమించి సూర్యకుమార్ ఎలా ఆడతాడనే దానిపై అందరి దృష్టి ఉంది. మరి టీమ్ ఇండియా పెట్టుకున్న ఆశలని నెరవేరుస్తాడా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×