BigTV English

Nadendla Manohar: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మంత్రి నాదెండ్ల ప్రశంసలు

Nadendla Manohar: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మంత్రి నాదెండ్ల ప్రశంసలు

Nadendla Manohar about Pawan Kalyan (Political news in AP) : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశంసల వర్షం కురిపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులను సోమవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ చేతులమీదుగా సత్కారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. జనసేన పార్టీని స్థాపించిన రోజు నుంచి ఇప్పటివరకు చాలా ఓపికగా అభివృద్ధి చేశారన్నారు. పార్టీని అంచెలంచెలుగా ఎదిగేలా చేయడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర ఉందన్నారు. ఆయన చాలా ఓపికతో పాటు పక్కా వ్యూహంతో వ్యవహరించారన్నారు.


రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నామని, మిత్ర పక్షాలతో సమన్వయంతో వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కూటమితోపాటు పార్టీకి చెడ్డసేరు రాకుండా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జనసైనికులు కలిసి పనిచేయాలని కోరారు. మనకు పదవులు వచ్చాయని, అయితే ఈ పదవులు రావడానికి కారణమైన జన సైనికులు, వీర మహిళలు ఎప్పటికీ మరచిపోవద్దని కోరారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీ నాయకులు జనసేనతోపాటు ప్రభుత్వాన్ని విమర్శిస్తారని, అలాగు దుష్ప్రచారం మొదలు పెట్టే అవకాశం ఉందని, ఈ సమయంలో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయని, ఈ ప్రభుత్వం అమలు చేసే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని పార్టీ నాయకులు సూచించారు. అందరూ నిజాయితీగా పనిచేయాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరు రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శలు చేశారు. త్వరలో క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. గతంలో తక్కువ సంఖ్యలో క్రియాశీలక సభ్యులను చేర్పించినట్లు చెప్పుకొచ్చారు.


Also Read: జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్, ఒక్క ఓటమితో..

ప్రతీ జనసైనికుడు ప్రభుత్వంలో భాగస్వాముడేనని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇది మన ప్రభుత్వమని, పార్టీకి, పవన్‌కు మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేయాలన్నారు. పవన్ కల్యాణ్ టీం అంటే అందరూ గొప్పగా చెప్పుకోవాలన్నారు.

 

Related News

Roja: వైసీపీ నేత రోజా లోగుట్టు బయటకు.. ఆ మహిళ ఎవరో తెలుసా? అందుకే జగన్ సైలెంట్

Vizag: ఏపీకి గూడ్‌న్యూస్.. విశాఖలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌లో పవన్.. నేతలతో చర్చ, ఆ డబ్బుంతా కరెంటుకే

Aruna Custody: పోలీసుల విచారణలో అరుణ.. వాళ్లకు చెమటలు, వైసీపీ స్కెచ్ ఏంటి?

Village Clinics: ఏపీలో వైద్య సేవ‌ల‌కు మ‌హ‌ర్దశ.. ఇకపై విలేజ్ క్లినిక్‌

YSRCP: వైసీపీకి గుబలు పుట్టిస్తున్న నరసాపురం ఎంపీ..

Big Stories

×