E-Paper
Advertisement

Sravana Masam: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది

Sravana Masam: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది
Advertisement

Sravana Masam: శ్రావణమాసం 2024 ఆగస్టు 5వ తేదీ  నుంచి ప్రారంభమైంది. ఈ పవిత్ర మాసంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం వచ్చింది. హిందూమతంలో శ్రావణ మాసం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పరమేశ్వరుడికి ఇష్టమైన మాసం కూడా ఇదే. అందుకే శ్రావణమాసంలో శివ భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఈ మాసంలో మహాదేవుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవడంతో పాటు అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు.

శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా చెబుతారు. అందుకే శ్రావణ మాసంలో శుక్రవారం రోజు ఏదైనా పని చేస్తే లక్ష్మీదేవితో పాటు మహాదేవుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.ఎంత డబ్బు సంపాదించినా కొన్ని సార్లు ఖర్చులు రోజురోజుకు పెరుగుతుంటాయి. శ్రావణమాసం శుక్రవారం పూజా స్థలంలో ఐదు చిన్న ఏలాకులను ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఈ ఏలాకులను మీ పర్సులో పెట్టుకోండి. ఫలితంగా మీ సంపదను నిలుపుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

శ్రావణ మాసంలో శుక్రవారం రోజు శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయడం మంచిది. ఆలయంలో కూర్చుని శివలింగంపై నీళ్లు పోసి ఓం నమ: శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మహాదేవునికి మంత్రాన్ని జపించిన తర్వాత అదే స్థలంలో ఉండి లక్ష్మీదేవి మంత్రాన్ని ఓం శ్రీ కమలే కమలాయే ప్రసీద్ ప్రసీద్ శ్రీ హ్రీం ఓం మహాలక్ష్మాయ నమః అని జపించండి. ఆ తర్వాత మహాలక్ష్మిని స్మరిస్తూ కొంతసేపు ధ్యానం చేయండి. ఫలితంగా మహాలక్ష్మితో పాటు శివుడి అనుగ్రహం కూడా కలిగి మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

వివాహానికి పదే పదే అడ్డంకులు ఏర్పడుతున్నట్లయితే మీరు స్త్రీ అయినా పురుషులైన శ్రావణమాసంలో శుక్రవారం మీకు అనుకూలమైన సమయం. శుక్రవారం ఉదయం స్నానం చేసి, శివ లింగానికి నీరు పోసి ఐదు చిన్న ఏలాకులు, ఐదు రకాల మిఠాయిలను శివుడికి నైవేద్యంగా సమర్పించండి. తర్వాత నెయ్యి దీపం వెలిగించండి మహాదేవుడికి పార్వతికి హారతి ఇవ్వండి.

Advertisement

Also Read:  శ్రావణ మాసంలో శనివారం.. శని దోషం తొలగిపోవడానికి ఇలా చేయండి

లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం. పాలు, అన్నం వెన్నతో ఖీర్ తయారు చేసి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి సమర్పించండి. పూజ తర్వాత ఐదుగురు చిన్నారులను ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టండి. తర్వాత మిగిలిన పాలను కుటుంబంలో అందరూ తీసుకోండి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

శుక్రవారం నారాయణుడిని పూజించినా లక్ష్మీ దేవి ప్రసన్నురాలవుతుంది. ఫలితంగా మీ జీవితం నుంచి అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×