ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. వాస్తులో కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల కుటుంబంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు. నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి. చాలామంది నెగటివ్ ఎనర్జీని దెయ్యాలు, భూతాలుగా వర్ణిస్తారు. నెగటివ్ ఎనర్జీ అంటే అవి కాదు, ఇంట్లో ఉండే కొన్ని లోపాల వల్ల మనకు ఆ ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం చెడు ఫీలింగ్ ను ఇస్తుంది. అదే నెగిటివ్ ఎనర్జీకి ఉందని చెప్పే ముఖ్య లక్షణం.
వాస్తు శాస్త్రంలో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఈ రెండింటికీ ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇంట్లో సానుకూల శక్తి నిండి ఉంటే కుటుంబ సభ్యులు శాంతియుతంగా హాయిగా జీవిస్తారు. అదే నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పాలవుతుంది. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి చిట్కాలు కూడా ఉన్నాయి. అయితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?
ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి వాస్తు శాస్త్రం చిన్న చిట్కాలను చెప్పింది. మీరు బయట నుంచి ఇంటికి వచ్చాక ఇల్లు హాయిగా అనిపించాలి. ప్రశాంతంగా అనిపించాలి. బయట అలసిపోయి వచ్చిన వ్యక్తికి ఇల్లు సేదదీర్చే ప్రదేశం లాగా ఉండాలి, కానీ ఇంట్లోకి వచ్చాక కూడా ఏదో ఇబ్బందిగా మనసు కలత చెందినట్టు అనిపిస్తున్నా, అసౌకర్యంగా, అశాంతిగా అనిపిస్తున్నా ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు అవుతున్నా కూడా ఇల్లు ప్రతికూల శక్తి ప్రభావంలో ఉందని తెలుసుకోవాలి.
బయటి ప్రాంతాల్లో ఆనందంగా, సంతోషంగానే ఉండి… ఇంటికి వచ్చాకే మీ శరీరంలో భారంగా అనిపించడం, బాధగా అనిపించడం, ఏడుపు వస్తున్నట్లు అనిపించడం జరిగితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అర్థం చేసుకోండి. దీనికి వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని చిన్న చిట్కాలు ఉన్నాయి. నీటిలో ఉప్పు కలిపి ఇల్లంతా చల్లండి. తర్వాత మాప్ పెట్టి తుడిచేయండి. ఒక గిన్నెలో పటికను పెట్టి ఆ గిన్నెను బాత్రూంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోయే అవకాశం ఉంది.
అలాగే ఇంట్లోకి రాగానే మీకు ఏదో తెలియని భయం, ఎవరో మనల్ని తరుముతున్నట్టు అనిపించడం, ప్రశాంతంగా లేకపోవడం… అన్నీ కూడా ప్రతికూల శక్తికి సంకేతాలే. ఒక వ్యక్తిని అలసిపోయేలా గందరగోళానికి గురయ్యాలా చేయడమే ప్రతికూల శక్తి ప్రధాన లక్షణం.
Also Read: ఇంట్లో గడియారం, అద్దం పొరపాటున కూడా ఈ దిక్కులో పెట్టకూడదు తెలుసా ?
ప్రతికూల శక్తి అనగానే దెయ్యాలు, భూతాలు అని ఆలోచించకండి. ఆ ఇల్లు వాస్తు ప్రకారం లేకపోయినా తప్పుడు స్థానాల్లో వస్తువులను ఉంచినా కూడా కొన్ని రకాల వాస్తు దోషాలు తెలుపుతాయి. ఆ వాస్తు దోషాలే ప్రతికూల శక్తిగా మారుతాయి. ఇవి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు మీలో కనిపిస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని బయటికి పంపేందుకు వాస్తు చిట్కాలను పాటించండి. మీ ఇల్లు మళ్లీ ఆనందమయంగా మారుతుంది.