BigTV English

Satyabhama Today Episode : ఇద్దరి పెళ్లాల మధ్య నలిగిపోతున్న మహాదేవయ్య.. కళ్లు భైర్లు కమ్మే షాకిచ్చిన సత్య…

Satyabhama Today Episode : ఇద్దరి పెళ్లాల మధ్య నలిగిపోతున్న మహాదేవయ్య.. కళ్లు భైర్లు కమ్మే షాకిచ్చిన సత్య…

Satyabhama Today Episode November 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. గంగకు సపోర్ట్గా మహిళా సంఘాలు వచ్చి గోల చేస్తారు. మహదేవయ్యని గంగ బ్లాక్ మెయిల్ చేస్తుందని ఎవరూ తన కొడుకు ఇక్కడ లేరని క్రిష్ అంటే గంగ మనిద్దరిదీ పేగు బంధం అని అది ఇదీ అని డ్రామా చేస్తుంది. తన తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు చేతులు జోడించి దండం పెడతా వెళ్లిపో అని క్రష్ అంటే నేను నీకు దండం పెడతా అని గంగ అంటుంది. హే ఇక్కడ నుంచి వెళ్లిపో అమ్మ అని క్రిష్ అంటే నన్ను అమ్మా అన్నావు అని గంగ నటిస్తుంది. ఇక నర్శింహ ఎవరి బిడ్డనో తీసుకొచ్చి నీ బిడ్డ అంటున్నావు సిగ్గు లేదా అని మహదేవయ్యని అడుగుతాడు. ఆయన నా తండ్రి కాకపోతే ఈయనే ఎందుకు పచ్చబొట్టు పొడిపించుకున్నారని క్రిష్ అంటే లోకంలో ఇంత మంది తండ్రులు ఉంటే మీ నాన్నే ఎందుకు పచ్చ బొట్టు పొడిపించుకున్నాడు అని అడుగుతాడు. ఏదో ఒకరోజు మీ నాన్నకి మన గురించి తెలిసే ఇలా పచ్చబొట్టు వేసుకున్నాడని అంటుంది. ఇక డీఎన్ఏ టెస్ట్ కు అందరు అంగీకరిస్తారు. అయితే దానికి గంగ ఒక కండీషన్ ఉందని క్రిష్ని నేను నా కొడుకు అంటున్నా నువ్వు నీ కొడుకు అంటున్నావ్ కదా అందుకు నేను నువ్వు క్రిష్ ముగ్గురం డీఎన్ఏ టెస్ట్ చేయించుకుందామని అంటుంది. తాను డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే క్రిష్ తన కొడుకు కాదని తెలిసిపోతుందని మహదేవయ్య టెన్షన్ పడతాడు. అందరూ క్రిష్ మహదేవయ్య కొడుకే టెస్ట్ చేసుకుంటాడని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. గంగ పెట్టిన కండిషన్ కి మహదేవయ్య ఒప్పుకుంటాడు. ఇక బైరవి కూడా వాళ్ళ ముగ్గురు టెస్టులు చేయించుకుంటారు అనేసి చెప్తుంది. ఇక మహిళా సంఘాలు కూడా ఆ రిపోర్ట్ రావడానికి మూడు రోజులు పడతాయి అంతవరకు మేము గంగకు సపోర్ట్ గా ఉంటామని చెప్తారు. ఇక గంగ రిపోర్టర్ రావడానికి టైం పడుతుంది కదా అంతవరకు ఇదే నా ఇల్లు అనేసి ఇంట్లోకి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇక మహిళ సంఘాలు కూడా ఆ రిపోర్ట్ వచ్చేంతవరకు ఆమె మహదేవయ్య ఇంట్లోనే ఉండాలి అనేసి డిమాండ్ చేస్తారు. దానికి మహదేవయ్యతో పాటు క్రిష్ కూడా ఒప్పుకుంటాడు. ఇంట్లోకి రాగానే బంటి ఆకలి అనగానే ఇదంతా మన ఇడ్లీ నాన్న నీకు ఏది కాబడితే అది తినేసేయ్ అనేసి గంగ అంటుంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టిన ఇడ్లీలన్నీ బంటి తినేస్తాడు. ఇక అప్పుడే మహదేవయ్యా అక్కడికి వస్తాడు. ముందు నాకు పెట్టకుండా ఈ ఎలుగుబంటి కాడికి ఎందుకు పెట్టావు అనేసి బైరవి మీద అరుస్తాడు. అక్కడున్న ఇడ్లీలు మొత్తం బండి తినడంతో బైరవి షాక్ అవుతుంది. మన బిడ్డకి ఆకలి ఎక్కువే అది ఆలోచించాలి డిఎన్ఎ టెస్ట్ రిపోర్ట్ వచ్చేంతవరకు ఏదేదైనా భరించాలి అనేసి గంగ అంటుంది.

ఇక మహదేవయ్యా అరుస్తుంటే ఇలా నలుగురిలో అరిస్తే నేను చాలా బాధపడతాను అలా రూమ్ లోకి వెళ్లి అరవండి అనేసి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. అటు బైరవి కూడా అయినా నా మొగుడు అని లాగుతుంది. ఇద్దరి పెళ్ళాల మధ్య మహదేవయ్యా నలిగిపోతాడు. ఆ సీన్ చూసి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు. నా మొగుడిని నేను ఎప్పుడూ నలుగురిలో చేయి పట్టుకోలేదు అనేసి భైరవి అంటుంది. అందరూ గంగ మీద కోపంగా ఉంటారు. గంగ చెప్తుంది. గంగబంటి వంటగదిలోకి వెళ్లి ఇదంతా మందేను నువ్వు ఏది కాబట్టే అది తినొచ్చు అనేసి వెళ్తారు. అప్పుడే పంకజం అక్కడికి వచ్చి కొంచెం కూడా బెణుకు లేకుండా ఎలా చెప్పిందో చూశారా ఆ మొహంలో అసలు భయం అనేది లేదు మరి అసలు భయం అయ్యగారి దగ్గరే ఉంది అమ్మగారు అనేసి బైరవికి పుల్లలు పెడుతుంది. ఇక భైరవి నిజంగానే గంగకు ఈయనకు సంబంధం ఉందా అనేసి టెన్షన్ పడుతుంది.


మహదేవయ్య గార్డెన్ లో చుట్ట కాలుస్తుంటాడు. సత్య అక్కడికి వచ్చి సెటైర్లు వేస్తుంది. ఏంటి మావయ్య టెన్షన్ పడుతున్నారు. అడ్డంగా ఇరుక్కున్నానని బాధపడుతున్నారా? అలా బయటపడాలో అని ఆలోచిస్తున్నారా అనేసి కౌంటర్ లేస్తుంది.. మహదేవయ్య నేను భయపడింది ఆ గంగ ఎవరో నాకు తెలియదు అది ఒక చీమ లాంటిది నలిపేస్తే నలిగిపోతుంది చచ్చిపోతుంది అనేసి అంటాడు. గంగకి ఏమన్నా అయితే మహిళా సంఘాలు ఊరుకుంటాయా పోలీసులు అసలు ఊరుకుంటారా అంతకన్నా ముందు మీ ఫ్రెండ్ ఊరుకుంటారా అనేసి గుర్తు చేస్తుంది. ఈ చిన్న చీమను పంపించిన పెద్ద తలకాయ ఎవరో తెలుసుకుంటాను అప్పుడు ఉంటది వాళ్ళకి అనేసి మహాదేవయ్య అంటాడు. కావాలని ఎందుకనుకోవాలి ఎవరో ప్లాన్ అని అనుకోవచ్చు కదా మావయ్య అని సత్యం అంటుంది. గంగను ఇంటికి తీసుకొచ్చిందే నేను ఇదంతా నా ప్లాని క్రిష్ కి మీరు తండ్రి కాదన్న విషయాన్ని మీరే ఒప్పుకునేలా చేసాను అనేసి అంటుంది. సత్య మాటలు విన్న మహదేవయ్యా షాక్ అవుతాడు. నీ కాపురం కూలిపోతుంది నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావు అది ఆలోచించవా అని మహదేవ అంటాడు. దానికి సత్య నాకు కాపురం జోలికి వచ్చి చూడు ఏమవుతుందో నీకే తెలుస్తుంది అనేసి ఉంటుంది.

ఇక మహదేవయ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. గంగకు ఈయనకు నిజంగానే ఏదైనా సంబంధం ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది బైరవి. మహదేవయ్యకు కాలేలా గంగా అని పాట పెడుతుంది. ఇక నాకు ఈ టైంకి రాదు జాబు ఇవ్వాలని తెలీదా నీకు అని భైరవిని అడుగుతాడు మహదేవయ్యా.. నీ పనులు నేనొక్కదాన్నే చేసుకోవాలా ఆవిడకి చెప్పొచ్చు కదా అనేసి బైరవి అంటుంది. ఆవిడ ఎవరు అనేసి మహాదేవ అనగానే, నేను ఫోన్ చేసి చెప్తాను అనేసి నాటకం ఆడుతుంది. ఏది ఏమైనా మీరు డిఎన్ఏ టెస్ట్ మాత్రం చేయించుకోకుండా ఉండకూడదు. అది చేయించుకుని అన్న గాని మీరు చేయించుకొని చిన్నగాడు మన కొడుకే అని నిరూపించుకోవాలి ఇది మీ దగ్గరని మీరే చేయించుకోవాలి అనేసి మహదేవయ్యకు భైరవి వార్నింగ్ ఇస్తుంది. ఇక సత్య గంగా దగ్గరికి వెళుతుంది. గంగా బట్టల సర్దుకోవడం చూసి ఏమైంది అని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో గంగ బంటి, డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి డాక్టర్లు వస్తారు. మరి ఆ టెస్టులో అసలు నిజం బయటపడుతుందేమో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×