BigTV English

Raavi Tree : ఇంట్లో రావి చెట్టు పెరిగితే చెడు సంకేతమేనా?

Raavi Tree : ఇంట్లో రావి చెట్టు పెరిగితే చెడు సంకేతమేనా?


Raavi Tree : మనదేశంలో చెట్లను ఆరాధించే మంచి గుణం ఉంది. చెట్టును దేవతగా పూజ చేసే సంప్రదాయం ఇవాళ్టి రోజుల్లో కూడా కొనసాగుతోంది. అలాంటి చెట్లు కొన్ని ఇంట్లో పెరిగితే అది దేనికి సంకేతం. రావి, మర్రి చెట్లను దేవతా వృక్షాలు అంటారు. భగవద్గీతలోను శ్రీకృష్ణుడు రావిచెట్టు ప్రస్తావన తెచ్చాఉంది. ఎంతో విశిష్టమైన ఈ చెట్టును ఇంటి బయట ఉంటే పర్వాలేదు ఇంటో లోపల అది కూడా ఇంటిగోడపైనే షాపుపైనో మొలుస్తూ ఉంటాయి. దేవతా వృక్షం కాబట్టి ఈ చెట్టును తీయడానికి భక్తులు ఆలోచనలో పడుతుంటారు. అలా అని వదిలిస్తే ఇంటిగోడను చీల్చుకుంటూ మొక్క పెరిగి ఇల్లు కూలిపోయే పరిస్థితి కూడా వస్తుంది.

ఇంటి గోడమధ్యగానీ ఇంటి ఆవరణలో కానీ ఈ చెట్టు పెరిగితే ఇంటికి చెడు సంకేతంగా భావించాలని శాస్త్రం చెబుతోంది. అసలు రావి చెట్టు నీడ కూడా ఇంటిని తాకకూడదని శాస్త్రం చెబుతోంది. రావి చెట్లు ఇంట్లో మొలిస్తే వారికి ఆర్ధిక కష్టాలు పట్టి పీడిస్తాయి. ఏ పని మొదలుపెట్టినా ఆగిపోవడం ఉంటుంది. జీవితంలో అభివృద్ధి కాకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ చెట్టు ఇంట్లో మొలుస్తున్నప్పుడే వేళ్లతో సహా పెకిలించాలని పెద్దలు చెబుతుంటారు. అలా చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. రావి చెట్టు ఇంట్లో వచ్చినప్పుడు ఆదివారం ఉదయాన్నే ఇంట్లో పెరిగిన రావిచెట్టును పూజ చేసి వేళ్ళతో సహా తొలగించాలి. అప్పుడు ఎవరికీ ఎటువంటి పాపం ఉండదు.


రావిచెట్టు ఇంటికి దూరంగా ఉన్నప్పుడే శుభఫలితాలను ఇస్తుంది. ఒకవేళ ఇంట్లో ఎక్కడైనా పెరిగితే దాని అడుగు వరకు పెరగనిచ్చి,అ తరువాత దాన్ని వేర్లతో పాటు తీసి , మరొక ప్రదేశంలో నాటితే తొలగించిన పాపం నుంచి కాపాడబడతారు. తూర్పు దిశలో రావిచెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు. అలా నాటితే ఇంట్లో దుఃఖం,దారిద్ర్యం తాండవిస్తాయి .రావి చెట్టును తొలగించినా మళ్లీ మళ్లీ వస్తుంటే 45 రోజుల పాటు భక్తితో పూజించి, ప్రతిరోజూ దానిపై పచ్చి పాలతో అభిషేకించి తర్వాత దానిని తొలగించాలని శాస్త్రం చెబుతోంది.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×