E-Paper
Advertisement

Spiritual Power of Salt: ఇంట్లో గొడవలు తగ్గాలంటే.. ? ఉప్పుతో ఇలా చేయండి చాలు

Spiritual Power of Salt: ఇంట్లో గొడవలు తగ్గాలంటే.. ? ఉప్పుతో ఇలా చేయండి చాలు
Advertisement

Spiritual Power of Salt: ఉప్పు… వంటకాలకు రుచిని ఇచ్చే పదార్థం మాత్రమే కాదు. మన సంప్రదాయంలో దీన్ని ప్రతికూల శక్తిని తొలగించే.. శక్తి వంతమైన సాధనంగా భావిస్తారు. ఇంటి వాతావరణం అకారణంగా ఉద్రిక్తంగా మారి, చిన్న చిన్న విషయాలకే తరచుగా గొడవలు జరుగుతుంటే.. దానికి కారణం. ఇంట్లో పెరిగిన ప్రతికూల శక్తే కావచ్చు. ఈ ప్రతికూల శక్తిని తొలగించి, ఇంట్లో ప్రశాంతతను, శాంతిని నింపడానికి ఉప్పును ఉపయోగించే.. కొన్ని సులభమైన, శక్తి వంతమైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Advertisement

ఉప్పు, ప్రతికూల శక్తికి మధ్య సంబంధం:

మన పూర్వీకుల నమ్మకం ప్రకారం.. ఇళ్లలో జరిగే గొడవలు, మనస్పర్థలు, ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలు గాలిలో.. వస్తువులలో శక్తి రూపంలో పేరుకుపోతాయి. ముఖ్యంగా.. దొడ్డు ఉప్పులో.. అయానిక ధర్మాలు ఉండటం వల్ల అది ఈ ప్రతికూల శక్తులను త్వరితగతిన గ్రహించి.. పీల్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకే.. తరచుగా మనశ్శాంతి లోపించినప్పుడు ఉప్పును నివారణగా వాడమని సూచిస్తారు.

Advertisement

1. గొడవలు తగ్గడానికి ఉప్పు నీటితో శుభ్రం చేయడం:

ఇంట్లో గొడవలకు కారణమయ్యే ప్రతికూల శక్తిని తొలగించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం.

పద్ధతి: నేల తుడవడానికి ఉపయోగించే నీటిలో ఒక గుప్పెడు దొడ్డు ఉప్పు లేదా రాతి ఉప్పు కలపండి. ఆ ఉప్పు కలిపిన నీటితో ఇంట్లో నేల.. ముఖ్యంగా తరచుగా కుటుంబ సభ్యులు కలిసే హాల్, గదులను శుభ్రం చేయాలి. ఈ పనిని ప్రతి గురువారం మినహా మిగిలిన రోజుల్లో చేయవచ్చు. ముఖ్యంగా మంగళవారం లేదా శనివారం చేస్తే అత్యుత్తమ ఫలితం ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది: ఉప్పు కలిపిన నీరు నేల, గోడలలో పేరుకు పోయిన ప్రతి కూల శక్తిని లాగేసుకుని.. ఇంటిని సానుకూల శక్తితో నింపుతుంది. గొడవలు, మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత పెరుగుతుంది.

2. మూలల్లో ఉప్పును ఉంచడం:

కొన్ని సార్లు ప్రతికూల శక్తి ఇంటి మూలల్లో లేదా అలంకరణ వస్తువుల వెనక పేరుకుపోతుంది.

పద్ధతి: చిన్న గాజు లేదా మట్టి పాత్రలో.. కొద్దిగా దొడ్డు ఉప్పు తీసుకుని దాన్ని ఇంటికి సంబంధించిన నైరుతి లేదా ఆగ్నేయ మూలల్లో కనిపించకుండా ఉంచండి.

ముఖ్యంగా.. తరచుగా గొడవలు జరిగే గదిలో లేదా ఇంట్లో టాయిలెట్లలో ఒక చిన్న కప్పులో ఉప్పును ఉంచడం వల్ల అక్కడ పేరుకుపోయిన దుష్ట శక్తి త్వరగా తొలగిపోతుంది.

ఎప్పుడు మార్చాలి: ఈ ఉప్పును ప్రతి వారం లేదా 15 రోజులకు ఒకసారి తప్పకుండా మార్చాలి. 

ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో (లేదా టాయిలెట్‌లో ఫ్లష్) పడేయాలి. దీనికి కారణం.. పాత ఉప్పు అప్పటికే ప్రతికూల శక్తిని పూర్తిగా గ్రహించుకొని ఉంటుంది.

Also Read: ఉదయం లేవగానే ఈ ఒక్క పని చేస్తే… అదృష్టం, సంపద మీ సొంతం!

3. భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం:

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు, మనస్పర్థలు వస్తుంటే.. ఈ చిట్కా పాటించండి.

పద్ధతి: పడుకునే గదిలో ఒక చిన్న పాత్రలో ఉప్పును పక్కన పెట్టుకుని, మూడు రోజుల తర్వాత దాన్ని తీసి పారేయడం ద్వారా వారి మధ్య ఉండే ప్రతికూల శక్తి తొలగి, ప్రేమ, సఖ్యత పెరుగుతాయి.

ఈ విధంగా ఉప్పును ఉపయోగించడం ద్వారా.. ఇంట్లో వాతావరణం తేలికపడి, నివాసయోగ్యంగా మారుతుంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసే ఒక శక్తివంతమైన ప్రక్రియగా పరిగణించాలి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×