E-Paper
Advertisement

Morning Vastu Tips: ఉదయం లేవగానే ఈ ఒక్క పని చేస్తే… అదృష్టం, సంపద మీ సొంతం!

Morning  Vastu Tips: ఉదయం లేవగానే ఈ ఒక్క పని చేస్తే… అదృష్టం, సంపద మీ సొంతం!
Advertisement

Morning Vastu Tips: మన జీవితంలో అత్యంత శక్తివంతమైన, కీలకమైన సమయం ఏదైనా ఉందంటే.. అది ఉదయం మాత్రమే. వేదాలు, పురాణాలు ‘బ్రహ్మ ముహూర్తం’గా పేర్కొనే ఈ వేళలో.. మనస్సు ప్రశాంతంగా, గ్రహణ శక్తి అధికంగా ఉంటుంది. మనం నిద్ర లేవగానే చేసే మొదటి పని, ఆ రోజు మొత్తం మన శక్తి ప్రవాహాన్ని, విజయాన్ని, అదృష్టాన్ని నిర్దేశిస్తుంది. తొందరగా లేచి పరుగు పరుగున దినచర్య మొదలుపెట్టే బదులు, కొన్ని నిమిషాలు కేటాయించి ఒక పురాతన, శక్తి మంతమైన అభ్యాసాన్ని ఆచరిస్తే.. అదృష్ట దేవత, సంపద మీ వైపు చూస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

అత్యంత ముఖ్యమైన పని ‘కర దర్శనం’:
ఉదయపు తొలి అడుగు: కర దర్శనం నిద్ర లేవగానే.. పడకపై కూర్చుని, కళ్ళు తెరిచిన వెంటనే ఎక్కడా చూడకుండా.. మీ రెండు చేతులను జోడించి వాటి అర చేతులను చూడండి. ఇదే ‘కర దర్శనం’. ఇది కేవలం అరచేతులను చూడటం కాదు. మనలో నిబిడీకృతమై ఉన్న దివ్య శక్తిని మేల్కొల్పే ప్రక్రియ.

Advertisement

మన భారతీయ సంస్కృతిలో.. ఈ అర చేతులలో త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు), త్రిశక్తులు (లక్ష్మీ, సరస్వతి, పార్వతి) నివసిస్తారని చెబుతారు. ఈ సమయంలో.. ఒక సంస్కృత శ్లోకం ఉంది. మన అర చేతి ముందు భాగంలో (వేళ్ల కొనలలో) సంపదకు అధిదేవత అయిన లక్ష్మీ దేవి, మధ్య భాగంలో జ్ఞానానికి అధిదేవత సరస్వతి దేవి, అర చేతి మూలంలో సృష్టికర్త గోవిందుడు కొలువై ఉంటారు. కాబట్టి.. ఉదయం లేవగానే ఆ కర దర్శనం చేసుకుంటే.. వారికి నమస్కరించినట్లే అవుతుంది.

లక్ష్మీ దేవి సంపదను, సరస్వతి దేవి జ్ఞానాన్ని, గోవిందుడు శుభాన్ని.. రక్షణను ప్రసాదిస్తారు. మన చేతులు మనం కర్మలు చేయడానికి.. సంపాదించడానికి ఉన్న సాధనాలు. ఈ సాధనాలను పూజించడం అంటే.. మీ పనిని… మీ కృషిని మీరు గౌరవించుకోవడం. ఈ శుభ సంకల్పంతో రోజును ప్రారంభిస్తే.. మీ ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి, సంపద పెరిగే మార్గాలు సుగమమవుతాయి.

Advertisement

రెండో ముఖ్యమైన అభ్యాసం: భూమికి నమస్కారంకర దర్శనం పూర్తయిన తర్వాత.. మీరు పడక నుంచి దిగి నేలపై అడుగు పెట్టడానికి ముందు, నేలను తాకి క్షమాపణ వేడు కోవడం మరో ముఖ్యమైన అభ్యాసం. మనల్ని భరిస్తున్న భూమిని (భూమాతను) పాదాలతో తాకుతున్నందుకు క్షమించమని వేడుకోవడం వినయాన్ని, కృతజ్ఞతను తెలియజేస్తుంది.

వినయం, కృతజ్ఞత అనేవి సంపదను, గౌరవాన్ని ఆకర్షించే అత్యంత శక్తి వంతమైన మానసిక స్థితులు ప్రయోజనాలు.. శాంతి, ఏకాగ్రత, విజయం నిద్ర లేవగానే ఈ కొద్ది పాటి నిమిషాలు మీ రోజుకు సరైన పునాదిని వేస్తాయి.

శుభ సంకల్పం: రోజును కృతజ్ఞతతో.. దైవ భావనతో.. ప్రారంభించడం వల్ల మనస్సులో అనవసరమైన ఆందోళనలు తొలగిపోయి. శుభ సంకల్పం స్థిర పడుతుంది.

ఏకాగ్రత: అర చేతులను చూడటం అనేది ఒక రకమైన మెడిటేషన్ (ధ్యానం). ఇది మెదడును వెంటనే బాహ్య ప్రపంచపు ఒత్తిడిలోకి వెళ్లకుండా నిరోధించి, ఏకాగ్రతను పెంచుతుంది.

అదృష్టం: రోజుకు కావాల్సిన ఆధ్యాత్మిక శక్తిని మీ శరీరంలో నింపుతుంది. దీంతో మీ నిర్ణయాలు సక్రమంగా ఉండి, చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూడటం, పరుగు పెట్టడం కాకుండా.. ఈ కర దర్శనాన్ని ఆచరించండి. కేవలం ఒక్క నిమిషం చేసే ఈ పని మీ జీవితంలో అదృష్ట ద్వారాలను తెరిచి, సంపదను, శాంతిని అందిస్తుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×