BigTV English

Onions:పండుగ రోజు ఉల్లిపాయలు తింటే అపచారమా…

Onions:పండుగ రోజు ఉల్లిపాయలు తింటే అపచారమా…

Onions:ఈరోజుల్లో పండగలు, పబ్బాలు అప్పుడే కాదు నార్మల్ రోజుల్లో కూడా నాన్ వెజ్ తినడం సాధారణం అయిపోయింది. గరగరం మసాలాలు తినడం అలవాటు చేసుకున్నారు. కానీ పూర్వం కనీసం ఉల్లిపాయ కూడా తినే వారు కాదు . నాన్ వెజ్ వండుకునే పండుగలు కాకుండా మిగతా అన్ని పండుగల అప్పుడు ఉల్లిపాయలు తినకూడదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. పండుగ రోజులు, అలాగే పూజ చేసుకునే దినాలు చాలా పవిత్రమైనవి.ఆ రోజంతా మనసును ప్రశాంతంగా, నిర్మలంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మనసును, శరీరాన్ని భగవంతుడి మీదే లగ్నం చేయాలి. అలా మనసంతా దైవం మీదే ఉండాలంటే ఉల్లిపాయను తినకూడదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ఉల్లిపాయలో ఉత్తేజం చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది.


నిగ్రహాన్ని సడలించేలా చేస్తుంది. వాటిని పండుగ రోజుల్లో దూరంగా ఉంచాలి.అందుకే ఉల్లిపాయను తినకూడదని చెబుతుంటారు. ఈ ఆచారాన్ని బ్రాహ్మణులు పాటిస్తుంటారు. అసలు ఇంట్లో ఏ ఒక్క వంటలోనూ వాడరు. అందుకు ప్రధాన కారణం… ఎక్కువగా పెళ్లిళ్లు, పూజలు వంటి శుభ కార్యాలు జరిపిస్తుంటారు. అలాంటప్పుడు ఎంతో మంది ఆడ వాళ్ల చేతులు వారికి తగులుతుంటాయి.అలాంటప్పుడు వారు నిగ్రహం కోల్పోకుండా ఉండాలని ఉల్లిపాయలను తినరు. ఇంట్లోని స్త్రీని తప్ప బయట వారెవరినీ అలా చూడకూడదు అనే ఉద్దేశంతోనే ఉల్లిపాయలు తినకూడదని చెబుతుంటారు.

కొన్ని మాలధరణ సమయాల్లో కూడా ఉల్లిని తీసుకోవడం నిషిద్దం. పండుగ రోజుల్లో ఉల్లి, వెల్లుల్ని కూడా దూరం పెడుతుంటారు. నవరాత్రి రోజుల్లో..సమయంలో వ్రతం ఆచరించేవారు ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకూడదు. ఉల్లిపాయలు శరీరంలో వేడిని కూడా ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల నవరాత్రి ఉపవాస సమయంలో ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం వుంది. వెల్లుల్లిని తినడం వల్ల సదరు వ్యక్తి వారి ప్రవృత్తిపై పట్టు కోల్పోయేలా చేస్తుంది. ఇది కోరికలు గతి తప్పేలా చేస్తుంది కనుక దీన్ని కూడా ముట్టుకోరు. కేవలం భక్తిభావంతో నవరాత్రుల సమయంలో అమ్మవారిని కొలుస్తారు.


పెద్దలు చెప్పే ప్రతీ మాట వెనుక ఒక సైంటిఫిక్ కారణం ఉంటుంది.అందుకే ఇక మీదట అయినా ఉల్లిపాయలు తినకుండా ఉండే మంచిది.పెద్దలు చెప్పిన మాటలు విని పాటిస్తే… మనకే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×