E-Paper
Advertisement

Walking Under Ladder: నిచ్చెన కింద నిలబడితే బ్యాడ్ లక్? దాని కింద నడిస్తే.. అలా జరుగుతుందా, బాబోయ్!

Walking Under Ladder: నిచ్చెన కింద నిలబడితే బ్యాడ్ లక్? దాని కింద నడిస్తే.. అలా జరుగుతుందా, బాబోయ్!

Walking Under Ladder: రోడ్డు మీద వెళ్తున్నప్పుడో లేదంటే ఎక్కడైనా బిల్డింగ్ పని జరుగుతున్నప్పుడో.. గోడకు నిచ్చెన వేసి ఉంటే మీరు ఏం చేస్తారు? చాలామంది దాన్ని చూడగానే సడన్‌గా పక్కకు తప్పుకుంటారు. ఆ నిచ్చెన కింద నుంచి వెళ్తే ఏదో అరిష్టం జరుగుతుందని, బ్యాడ్ లక్ వెంటాడుతుందని మనలో చాలామందికి ఒక రకమైన భయం.

పైకి మాత్రం ‘అవన్నీ మూఢనమ్మకాలులే భయ్యా’ అని కొట్టిపారేసినా.. నిచ్చెన కింద నుంచి వెళ్లాల్సి వస్తే మాత్రం మనసులో ఏదో తెలియని టెన్షన్ మొదలవుతుంది. అసలు ఈ నిచ్చెన కథ ఏంటి? అరిష్టం అని ఎందుకు అంటారు? దీని వెనుకున్న ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

వేలఏళ్ల నాటి నమ్మకం..

ఈ నిచ్చెన భయం అనేది నిన్న మొన్నటిది కాదు.. దీనికి వేలఏళ్ల హిస్టరీ ఉంది. ప్రాచీన ఈజిప్షియన్లు ట్రయాంగిల్ షేప్‌ను చాలా పవిత్రంగా చూసేవారు. వాళ్లు కట్టిన పిరమిడ్లు కూడా అదే షేప్‌లో ఉండటం మీరు గమనించే ఉంటారు. గోడకు నిచ్చెన వేసినప్పుడు అక్కడ ఓ త్రిభుజాకారం ఏర్పడుతుంది. ఆ ఖాళీ ప్లేస్ ద్వారా నడిస్తే అక్కడ ఉండే దేవుళ్లను లేదా ఆత్మలను అవమానించినట్టు అవుతుందని, వాళ్లకు కోపం వస్తుందని ఆ రోజుల్లో గట్టిగా నమ్మేవాళ్లట.

Also Read: జల్లికట్టు ఎందుకంత ఫేమస్? పోటీలో దిగాలంటే నాన్‌వెజ్ తినకూడదా? ఆసక్తికర విషయాలు ఇవిగో..

దైవత్వానికి ప్రతీకగా..

క్రైస్తవ సంస్కృతిలో కూడా ఈ నమ్మకానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. నిచ్చెన నిలబడ్డప్పుడు ఏర్పడే ఆ త్రిభుజాన్ని ‘హోలీ ట్రినిటీ’ (తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ)కి చిహ్నంగా భావిస్తారు. ఆ నిచ్చెన కింద నుంచి నడవటం అంటే.. ఆ పవిత్రతను బ్రేక్ చేయడమే అని, అలా చేస్తే దేవుడికి కోపం వస్తుందని యూరప్ దేశాల్లో నమ్మేవారు. ఇప్పటికీ ఇటలీ వంటి దేశాల్లో ఈ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది.

చావుతో ముడిపడిన భయం..

ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పాత కాలంలో నేరస్తులను ఉరి తీయడానికి ఉపయోగించే ‘ఉరి కంబం’ నిచ్చెన ఆకారంలో ఉండేదట. ఖైదీలను ఉరితీసే ముందు వాళ్లను ఆ నిచ్చెన కింద నుంచే నడిపించేవారట. అందుకే నిచ్చెన కింద నడవటం అంటే మరణానికి వెల్‌కమ్ చెప్పడమే అని జనాలు భయపడటం స్టార్ట్ చేశారట.

పశ్చిమ దేశాల్లోనూ..

నిచ్చెన కింద నడవకూడదు అనే సెంటిమెంట్ కేవలం ఇటలీలోనే కాదు.. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి వెస్ట్రన్ కంట్రీస్‌లో కూడా ఎక్కువే. స్వీడన్ లాంటి దేశాల్లోనైతే.. పొరపాటున నిచ్చెన కింద నడిస్తే మూడు వారాల పాటు బ్యాడ్ లక్ వెంటాడుతుందని ఫీల్ అవుతారు. మన ఇండియాలో ఇది లోకల్ నమ్మకం కాకపోయినా.. హాలీవుడ్ సినిమాలు, వెస్ట్రన్ కల్చర్ ఎఫెక్ట్‌తో ఇప్పుడు ఇక్కడ కూడా నిచ్చెన కనిపిస్తే సైలెంట్‌గా పక్క నుంచి వెళ్లిపోతున్నారు.

నిజంగానే ప్రమాదమా?

నిజానికి ఈ సెంటిమెంట్ వెనుక ఒక మంచి లాజిక్ కూడా ఉంది. గోడకు నిచ్చెన వేసి ఉందంటే పైన ఎవరో ఒకరు పని చేస్తున్నారని కదా అర్థం. మనం దాని కింద నుంచి వెళ్తున్నప్పుడు పైన ఉన్న వ్యక్తి చేతిలోంచి ఏదైనా వస్తువు టప్పున కింద పడొచ్చు.. లేదా ఆ నిచ్చెన బ్యాలెన్స్ తప్పి మన మీదే పడొచ్చు. ఈ యాక్సిడెంట్స్ నుంచి మనల్ని కాపాడడానికే మన పెద్దలు నిచ్చెన కింద నుంచి వెళ్లొద్దని చెప్పి ఉంటారు. కాలక్రమేణా అది కాస్తా భయంగా, సెంటిమెంట్‌గా మారిపోయింది.

పొరపాటున వెళ్తే ఏం చేయాలి?

ఒకవేళ ఎవరైనా తెలియక నిచ్చెన కింద నుంచి వెళ్లారనుకోండి.. ఆ బ్యాడ్ లక్ పోగొట్టుకోవడానికి కొన్ని దేశాల్లో వింత వింత పద్ధతులు ఉన్నాయి. కొందరు వెనక్కి తిరిగి మళ్లీ నిచ్చెన కింద నుంచి నడవాలని చెబితే, మరికొందరు వేళ్లు క్రాస్ చేసుకోవాలని అంటారు. ఇంకొందరైతే భుజంపై నుంచి మూడుసార్లు ఉమ్మేయాలని కూడా చెబుతుంటారు.

రిస్క్ ఎందుకు బ్రో..

ఏదేమైనా ఇదంతా మన నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది. అయినా, తల మీద పెయింట్ డబ్బా పడకుండా ఉండాలన్నా, నిచ్చెన జారి కింద పడకుండా ఉండాలన్నా.. ఆ నిచ్చెన కింద నుంచి వెళ్లకుండా.. కాస్త దూరం నుంచి నడుచుకుంటూ వెళ్లిపోవడమే బెటర్ కదా.

Also Read: మేడారం జాతరకు వెళ్తున్నారా? లగేజీ సర్దుకునే ముందు ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందే!

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×