E-Paper
Advertisement

Medaram Jatara 2026: మేడారం జాతరకు వెళ్తున్నారా? లగేజీ సర్దుకునే ముందు ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందే!

Medaram Jatara 2026: మేడారం జాతరకు వెళ్తున్నారా? లగేజీ సర్దుకునే ముందు ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందే!
Advertisement

Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర కేవలం ఉత్సవం మాత్రమే కాదు.. కోట్లమంది నమ్మకం కూడా. అడవి తల్లి గడ్డపై జరిగే ఈ మహా జాతరకు వెళ్లేటప్పుడు భక్తితో పాటు కాస్త ముందస్తు జాగ్రత్త కూడా చాలా అవసరం. లక్షలాది మంది తరలివచ్చే సమ్మక్క-సారలమ్మల జాతరలో మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ కింది సూచనలను తప్పకుండా పాటించాలి.

ఇవి వెంట ఉండాల్సిందే..

మేడారం ప్రయాణం శారీరకంగా కొంత శ్రమతో కూడుకున్నది. అందుకే మీ వెంట తప్పనిసరిగా ఆధార్‌కార్డు వంటి గుర్తింపు కార్డు ఉండాలి. అక్కడ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు కాబట్టి.. ఫోన్ కోసం పవర్ బ్యాంక్, నగదు చెల్లింపుల కోసం చిల్లర డబ్బులు దగ్గర పెట్టుకోవడం ఉత్తమం. ఇక బట్టల విషయానికొస్తే.. అంత రద్దీలో, ముఖ్యంగా ఎండలో సౌకర్యంగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం. నడవటానికి వీలుగా ఉండే స్పోర్ట్స్ షూస్ లేదా గ్రిప్ ఉన్న చెప్పులు వేసుకోవడం వల్ల కాళ్ల నొప్పులు అంతగా ఉండదు.

Advertisement

Also Read: పిల్లలపై భోగి పళ్లు ఎందుకు పోస్తారు? ఈ ఆచారం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?

భక్తితో పాటు ఆరోగ్యమూ జాగ్రత్త..

లక్షలాది మంది వచ్చే ఈ జాతర వాతావరణంలో దుమ్ము వల్ల త్వరగా అలసిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మీ బ్యాగులో ORS ప్యాకెట్లు, గ్లూకోజ్, మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత మందులు దగ్గర పెట్టుకోవడం మర్చిపోవద్దు. అలాగే బయట దొరికే ఆహారం కంటే.. ఇంటి నుండి తెచ్చుకున్న స్నాక్స్, పండ్లు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ వంటి సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి గొడుగు, సన్‌స్క్రీన్ వాడటం మర్చిపోవద్దు. ముఖ్యంగా మాస్క్ ధరించడం వల్ల దుమ్ము నుండి ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు.

వీటి జోలికి అస్సలు వెళ్లొద్దు..

Advertisement

అమ్మవార్ల దర్శనానికి వెళ్లేటప్పుడు భారీ లగేజీని వెంట తీసుకెళొద్దు. అలాగే బంగారు నగలు, ఖరీదైన వస్తువులు ధరించడం వల్ల దొంగతనాల జరిగే అవకాశం ఉంటుంది. జాతరలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్లిక్ కవర్లను విసరడం వంటివి అస్సలు చేయొద్దు. ముఖ్యంగా మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం సమ్మక్క-సారలమ్మల జాతర పవిత్రతకు అగౌరం కూడా. అలాగే అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఆహారాన్ని సున్నితంగా తిరస్కరించండి.

రద్దీలో సురక్షితంగా ఉండాలంటే?

మేడారంలో జనసందోహం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. మీ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే గనుక.. ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడవండి. పొరపాటున ఎవరైనా తప్పిపోతే కలుసుకోవడానికి ఒక నిర్ణీత ప్రదేశాన్ని ముందుగానే మాట్లాడుకుని పెట్టుకోండి. చిన్న పిల్లలు, వృద్ధుల జేబులో మీ ఫోన్ నంబర్లు ఉన్న పేపర్‌ను ఉంచడం చాలా తెలివైన పని. అలాగే పోలీసుల సూచనలను పాటిస్తూ, తోపులాటలకు తావు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోండి.

Also Read: జల్లికట్టు ఎందుకంత ఫేమస్? పోటీలో దిగాలంటే నాన్‌వెజ్ తినకూడదా? ఆసక్తికర విషయాలు ఇవిగో..

 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×