E-Paper
Advertisement

Garuda Purana: మీరు చేసే పాప కర్మలే మీ రోగాలకు కారణమట – ఇంకా గరుడ పురాణంలో ఏముందంటే

Garuda Purana: మీరు చేసే పాప కర్మలే మీ రోగాలకు కారణమట – ఇంకా గరుడ పురాణంలో ఏముందంటే
Advertisement

Garuda Purana: మీరు చేసే పాప కర్మలే మీకు రోగాలై ఎదురొస్తాయట. ఎంతటి పాపం చేస్తే అంతటి రోగం మిమ్మల్ని వెంటాడుతుందట. దైనందిన జీవితంలో మనుషులు అనుభవించే రోగ బాధలన్నీ తమ కర్మలో భాగమేనని గరుడపురాణం చెప్తుందట. ఇంతకీ గరుడపురాణంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందామా..?

గరుడ పురాణం ప్రకారం మనిషికి వచ్చే రోగాలకు కేవలం శారీరక కారణాలే కాకుండా, అంతకుముందు జన్మల్లో చేసిన పాప కర్మలు  కూడా ప్రధాన కారణాలుగా గరుడపురాణంలో చెప్పబడిందట. దీనినే కర్మ విపాకం అంటారట. ఏ తప్పు చేస్తే ఏ రోగం వస్తుందో గరుడ పురాణంలో చాలా వివరంగా ఉందని పండుతులు చెప్తున్నారు. ఏ తప్పు చేస్తే ఏ రోగం వస్తుందో గరుడపురాణం ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

శారీరక వ్యాధులు మరియు కర్మలు: గత జన్మలో గురువును అవమానించిన వారికి లేదా బ్రాహ్మణులను హింసించిన వారికి కుష్టు వ్యాధి (Leprosy) వస్తుందని గరుడపురాణం చెప్తుందట. అలాగే గత జన్మలో పరాయి స్త్రీలను లేదా పురుషులను మోహించిన వారికి, దొంగతనాలు చేసిన వారికి ఈ జన్మలో క్షయ వ్యాధి (Tuberculosis) వస్తుందట. ఇక ఇతరుల ఆస్తిని అన్యాయంగా అపహరించిన వారికి లేదా పవిత్రమైన గ్రంథాలను అవమానించిన వారికి చూపు పోతుందని వారు  ఆ జన్మాంతం గుడ్డితనంతో (Blindness) బాధపడతారని గరుడపురాణం చెప్తుందట. అలాగే ఎదుటివారిని నిరంతరం దూషించే వారికి లేదా ఇతరుల రహస్యాలను చాడీలుగా చెప్పే వారికి వచ్చే జన్మలో మాట పడిపోవడం లేదా వినికిడి లోపం కలుగుతుందని వారు జీవితాంతం చెవిటి వారిగా లేదా మూగవారిగా బతికేస్తారని గురుడపురాణంలో ఉందట.

మానసిక మరియు ఇతర సమస్యలు: ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉన్నా చేయకుండా, గర్వంతో ప్రవర్తించే వారికి ఈ జన్మలో తీవ్రమైన తలనొప్పి (Migraine) వస్తుందని గరుడపురాణంలో ఉందట. అలాగే అతిగా స్వార్థం కలిగి ఉండి, ఇతరులకు ఆహారాన్ని పెట్టకుండా తానే అనుభవించే వారికి ఈ జన్మలో మధమేహం ( డయాబెటిస్‌) వస్తుందట. ఇక చిన్న పిల్లలను హింసించినా లేదా పితృ దేవతలకు చేయాల్సిన కార్యాలను (తర్పణాలు) సరిగ్గా చేయకపోయినా సంతాన సమస్యలు వస్తాయని గరుడ పురాణం చెప్తోందట.

Advertisement

పరిష్కార మార్గాలు (ప్రాయశ్చిత్తం): గరుడ పురాణం కేవలం రోగాల గురించి మాత్రమే చెప్పలేదట. వాటికి కారణాలు చెప్తూ.. పరిష్కార మార్గాలను కూడా సూచిస్తుందట. అలాగే ఏం చేస్తే ఏం రోగం వస్తుందో చెప్పిన గరుడపురాణం.. ఆ రోగాన్ని తగ్గించుకునే ప్రక్రియను కూడా సూచించిందట.

దానం, జపం చేయడం: పై సమస్యలతో బాధపడేవారు..  అన్నదానం, వస్త్రదానం మరియు పేదలకు సహాయం చేయడం వల్ల కర్మ ఫలాలు తగ్గిపోతాయట. ఇక భగవంతుని నామాన్ని నిరంతరం స్మరిస్తూ.. జపం చేయడం  వల్ల మనసు శుద్ధి అయ్యి, వ్యాధుల తీవ్రత తగ్గుతుందట. రోగులకు, వృద్ధులకు మూగ జీవాలకు సేవ చేయడం ద్వారా కూడా పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయని గరుడపురాణంలో ఉందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వందేళ్ల తర్వాత కాశీ ఎలా ఉంటుందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×