BigTV English
Advertisement

Lucky Zodiac Signs: ఏడాదంతా ఈ రాశులపై బృహస్పతి అనుగ్రహం

Lucky Zodiac Signs: ఏడాదంతా ఈ రాశులపై బృహస్పతి అనుగ్రహం

Lucky Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సంపద, ఆనందం, అదృష్టానికి కారకుడు బృహస్పతి. జాతకంలో బృహస్పతి బలంగా ఉన్నప్పుడు ఆయా రాశుల వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యక్తి జీవితంలో దేనికి లోటు ఉండదు. బృహస్పతి స్థానం బలహీనంగా ఉన్నప్పుడు జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అంతే కాకుండా జీవితంలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. బృహస్పతి 2024 మే1న వృషభ రాశిలోకి ప్రవేశించాడు.


ఈ సంవత్సరం అంతా బృహస్పతి రాశి చక్రాన్ని మార్చకుండా ఉంటాడు. తిరిగి 2025 మే 13న బృహస్పతి మేషరాశిని వదిలి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. మేషరాశిలో బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి అధిక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ మరికొన్ని రాశుల వారు జీవితంలో చిన్న, చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 12 రాశులపై గురు సంచార ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం,సింహం, ధనస్సు రాశులు:
జ్యోతిష్య శాస్త్రంలో మేషం, సింహం, ధనస్సు అగ్నికి సంకేతాలుగా భావిస్తారు. అగ్ని మూలంతో సంబంధం ఉన్న ఈరాశుల వారి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మేష, సింహం, ధనస్సు రాశుల వారికి కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడానికి గురుగ్రహం అనేక అవకాశాలను కల్పిస్తుంది. మీ ధన ప్రవాహం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు సృష్టించబడతాయి. పాత పెట్టుబడుల నుంచి రాబడి వస్తుంది. సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. మీరు పని చేసే ప్రాంతంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.


కన్యా, మకర, వృషభ రాశులు:

శరీరంలో పంచభూతాల ఆధారంగా ఈ రాశులను విభజించారు. బృహస్పతి ఈ రాశుల వారి జీవితాల్లో పెను మార్పులను తీసుకువస్తాడు. మీరు చేసే పనుల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. వృషభం, కన్యా, మకరం రాశుల వ్యక్తిగత ఎదుగుదలకు అనేక అవకాశాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం, తులా, కుంభ రాశులు:
బృహస్పతి సంచారంతో మిథున, తులా, కుంభ రాశుల వారు మతపరమైన పనులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతాన్ని మర్చిపోయి ముందుకు సాగుతారు. నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతే కాకుండా మానసికంగా ధృడంగా ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. జీవితంలో కొత్త విషయాలను అన్వేషిస్తారు. కొత్త అవకాశాలు పొందుతారు. యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. మానసిక ఒత్తిడి తొలగి పోయి ప్రశాంతంగా ఉంటారు.

Also Read: జూలై 8వ తేదీన అద్భుతం.. ఈ 3 రాశులపై రాహువు అనుగ్రహం

కర్కాటక, వృశ్చిక, మీన రాశులు:
బృహస్పతి.. కర్కాటక, వృశ్చిక, మీనరాశుల అన్ని కోరికలను నెరవేర్చనున్నాడు. ఈ సమయంలో ఈ రాశుల వారికి వృత్తిలో పురోగతి కలుగుతుంది. పనుల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. ప్రతి రంగంలో పురోగతి సాధిస్తారు. భాగస్వామితో మీ బంధం దృఢంగా మారుతుంది. కొత్త విషయాలను అన్వేషిస్తారు. మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. సంబంధాలు, ప్రేమ , నమ్మకం కూడా పెరుగుతాయి. వ్యక్తిగత జీవిత పురోగాభివృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి.

 

Related News

Incense Sticks: పూజ చేసేటప్పుడు.. ఎన్ని అగరబత్తులు వెలిగించాలో తెలుసా ?

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Big Stories

×