BigTV English

IND vs SA T20 WC 2024 Weather Update: ఫైనల్ మ్యాచ్ కి వరుణుడి ఆటంకం?

IND vs SA T20 WC 2024 Weather Update: ఫైనల్ మ్యాచ్ కి వరుణుడి ఆటంకం?

India vs South Africa Final Match(Sports news in telugu): టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. రాత్రి ఎప్పుడెప్పుడు అవుతుందా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సమయంలో వరుణుడు వచ్చి ఆటంకం కలిగిస్తాడేమోననే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట బార్బడోస్ పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్టులను గంట గంటకు తెగ వెతికేస్తున్నారు. సెమీస్ లో గెలిచి ఫైనల్ వరకు ఓటమి అన్నదే ఎరుగకుండా వచ్చిన ఇండియా-సౌతాఫ్రికా రెండు జట్లు కూడా కూడా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నాయి.


గత రెండు సెమీఫైనల్ మ్యాచ్ లకు వరుణుడు ఆటంకం కలిగించాడు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో మనవాళ్లు బ్యాటింగ్ చేసేటప్పుడు 8 వ ఓవర్ లో వర్షం పడి ఆగింది. అలాగే మ్యాచ్ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. సౌతాఫ్రికా వర్సెస్ ఆఫ్గాన్ మధ్య కూడా వర్షం పడింది. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ కి కూడా వరుణుడు ఆటంకం కలిగించేలా ఉన్నాడని వెదర్ రిపోర్టులు చెబుతున్నాయి.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమైతే, సాయంత్రం 4 గంటల నుంచి అక్కడ తేలికపాటి జల్లులతో కూడిన వర్షం రెండు గంటల వరకు కురిసే అవకాశాలున్నాయని అంటున్నారు. అంటే సాయంత్రం 6 గంటల వరకు వర్షం పడుతుంది. కాబట్టి పర్వాలేదని అంటున్నారు. నిజానికి లెక్క ప్రకారం చూస్తే బార్బడోస్ లో ఉదయం 10.30కి మ్యాచ్ మొదలవుతుంది. ఈ లెక్కన అన్నీ లెక్కేసుకోమని నెటిజన్లు చెబుతున్నారు.


Also Read: అదృష్టం మనవైపే ఉంది.. ఫైనల్ మ్యాచ్ పై ద్రవిడ్

అయితే మ్యాచ్ మధ్యలో కూడా మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలున్నాయని అంటున్నారు. అది కూడా కాసేపే పడుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. బార్బడోస్ సిబ్బంది కూడా మైదానాన్ని వెంటనే రెడీ చేసేందుకు సర్వ సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. అలాగే మ్యాచ్ రోజున 3 గంటల 10 నిమిషాలు అదనపు సమయం కూడా కేటాయించారు. అంతవరకు కూడా చూస్తారు. అప్పటికి తగ్గకపోతే ఇక రిజర్వ్ డే ఉండనే ఉంది. ఆ రోజు మ్యాచ్ జరుగుతుందని చెబుతున్నారు. అది కూడా కాకపోతే సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×