Big Stories

Kadamba Tree:ఆంజనేయుడి పుట్టుక వెనుక కదంబ వృక్షం!

kadamba tree:క‌దంబవృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు. ఇది ఆకురాల్చ‌దు. ఎప్ప‌టికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను బాగా ఇస్తుంది. అడవులలో ఎక్కువ‌గా పెరుగుతుంది. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు.హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం..అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. గార్దబాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమిమీద, మనుషులతో, జంతువులతో మరణం లేకుండా ఉండాలని వరం కోరతాడు. శివయ్య తథాస్సు అని వరమిస్తాడు.

- Advertisement -

వర గర్వంతో దేవలోకం చేరి ఇంద్రుడ్ని పారిపోయేలా చేస్తాడు గార్దబుడు. దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంటపెట్టుకుని పరమేశ్వరుని చేరతాడు. గార్దబాసురుని చంపమని కోరతాడు శ్రీమహావిష్ణువు. అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ సరదా మాట అంటాడు. నువ్వు గార్దబాసురుని చంపితే నేను దాసుడిగా ఉంటానంటాడు. దానికి శివయ్య నువ్వు గార్దబాసురుని చంపితే తానే దాసుడిగా మారతానని దానికి మరో మాట కలుపుతాడు.

- Advertisement -

వెంటనే మోహినీ రూపంలోకి మారిన విష్ణుమూర్తి గార్దబాసురుని అంతం చేసేందుకు వనానికి చేరతాడు. అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో పార్వతీ దేవి అందమైన కన్యరూపంలో వెళ్తుంది. అమ్మవారి అందానికి ముగ్దులైన రాక్షసులు ఆమె వెంట చేరతారు. మరోవైపు మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు కదంబాసురుడు. దీంతో కదంబాసురున్ని ఆకాశంలోకి ఎగరేసి.. తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు.

ముఖం తోడేలు.. మొండెం మనిషి రూపంలో ఉండి… పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు. అలా సంహరిస్తున్న తరుణంలో అంతమొందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరిని సంహరిస్తుంది అమ్మవారు. దీంతో గార్దబాసురుని సంహారం జరిగిపోయింది. ఇచ్చిన మాట ప్రకారం రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ బంటుగా సేవలు అందించాడు శివుడు.

Temple:ఆలయానికి ఒట్టి చేతులతో వెళ్లకూడదా….

OTT: ఒకేరోజే 18 సినిమాలు+ సిరీస్‌లు.. ఈ వీకెండ్ పండగ చేస్కోండి..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News