Watch Video:రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా ప్రతి రోజూ చాలా మంది ప్రమాదాలకు గురవుతుంటారు. వర్షకాలంలో పరిస్థితి ఇంకా దారుణం అనే చెప్పాలి. ఎందుకంటే గుంతలో నీరునిలిచిపోవడం వలన ఎక్కడ గుంత ఉందో మనకు అర్థం కాకుండా, ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఈ పరిస్థితిలో గుంతలో పడి కూడా బయటపడితే, నిజంగా అదృష్టవంతుడనే చెప్పాలి. పెద్ద ప్రమాదం నుంచి బయటపడి, బతికిపోయినట్టే అనుకోవాలి. రోడ్డుపై గుంతలు మన దేశంలో సాధారణ సమస్య కాదు, అవి నేరుగా ప్రాణాలకు ముప్పు తెచ్చేవని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఘటనకు గురైన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏం జరిగింది
ఈ వీడియోలో.. ఒక కారు వెనుక బైక్‌పై వెళ్తున్న ఈ వ్యక్తిని, మరో కారులోని వ్యక్తి తన సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తున్నాడు. కారు గుంతను దాటింది కానీ, వెనుక నుంచి వస్తున్న వ్యక్తి గుంతను చూసుకోకుండా దానిపై బైక్ ను నడిపాడు. అంతే బైక్‌తో సహా ఆ వ్యక్తి ఒక్కసారిగా గాల్లో ఎగిరి నడిరోడ్డుపై బొక్క బోర్లా పడ్డాడు. వెనుక నుంచి వస్తున్న కారులోని వ్యక్తి సడన్ బ్రేక్ వేయడంతో మరో ప్రమాదం తప్పింది. లేదంటే అతని తపై నుంచి కారు వెళ్లేది. ప్రమాదానికి గురైన వ్యక్తి మాత్రం చిన్న గాయాలతో బయటపడ్డాడు. వెంటనే తేరుకొని పక్కకు వెళ్లి హెల్మెట్ తీసి ఊపిరి పీల్చుకున్నాడు. వీడియో తీస్తున్న వ్యక్తి, పక్కనే ఉన్న వ్యక్తులతో కలిసి, పడిపోయిన బైక్‌ను లేపి, గాయపడిన వ్యక్తికి సహాయం చేశాడు.
Also Read: Amazon Alexa Offers: అలెక్సా డివైజ్‌లపై 50 శాతం తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్ త్వరపడండి
కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అదే సమయంలో మరో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఈ ప్రమాదాన్ని చూసి కూడా ఆగకుండా వెళ్లిపోయాడు. ఒకవైపు సహాయం చేసే మనుషులు ఉంటే, మరోవైపు బాధ్యత లేకుండా వెళ్లిపోయే వారు కూడా మన సమాజంలో ఉన్నారు. ఈ ఘటన మనకు ఒకటే గుర్తు చేస్తుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అదృష్టం ప్రతిరోజూ మన వెంట ఉండదు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ప్రయాణించాలి, అదృష్టాన్ని ఆశించడం కంటే బాధ్యతగా ఉండటం ముఖ్యం.
ప్రమాదం ఎక్కడ జరిగింది
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నువ్వు అదృష్ట వంతుడివి రా అబ్బాయ్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం జాగ్రత్తగా ఉంటే మంచిదని మరొకరు సలహా ఇస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడు లేదంటున్నారు. ఏదేమైనా మనం రోడ్డుపై ప్రయాణించే ముందు జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
Extremely lucky man!
Every year, thousands die due to potholes. He could have been one of them.
So instead of complaining about why I deserved this despite paying all the tax, cess, RTO, and tax on 80% petrol, he should be thankful that health insurance is now tax-free. Enjoy… pic.twitter.com/vEsNvG1vIS
— THE SKIN DOCTOR (@theskindoctor13) October 13, 2025