Duvvada Madhuri : బిగ్ బాస్ సీజన్ 9 ఆసక్తికరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో ఎవరు ఊహించని మలుపులు చాలా జరిగాయి. నాగార్జున చెప్పినట్లు ఇది చదరంగం కాదు రణరంగం అనే లైన్ ఈ షో కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పటికీ ఈ షో మొదలై దాదాపు నెల రోజులు పూర్తయిపోయింది. హౌస్ మేట్స్ నేటితో 36వ రోజు గడుపుతున్నారు.
ఇకపోతే ఇప్పటికే ఐదు వారాలు గడిచిపోయింది కాబట్టి ఐదుగురు బయటకు వెళ్లి పోవాల్సి ఉంటుంది. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఒకే రోజు ఇద్దరిని బయటకు పంపించేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో ఆరుగురు హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు. దువ్వాడ మాధురి, రమ్య మోక్ష, నిఖిల్ నాయక్, ఆయేషా, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా ఎంట్రీ ఇచ్చారు.
ఇప్పటివరకు ఐదు వారాలు బిగ్ బాస్ చాలా ఆసక్తికరంగా జరిగింది. హౌస్ మేట్స్ అందరూ ఒకరితో ఒకరు ఉండటానికి ఈ నెల రోజుల్లో అలవాటు పడిపోయారు. ఇటువంటి తరుణంలో ఆరుగురు మనుషులను బయటకు పంపించి, కొత్తగా మరో ఆరుగురిని హౌస్ లో పెట్టడం వలన షో రకరకాల మలుపులు తిరుగుతుంది. శ్రీజ ఎలిమినేషన్ తో షోలో పెద్ద హడావిడి ఉండదు అయిపోయింది అనుకున్న తరుణంలో దువ్వాడ మాధురి దుమ్ము దులుపుతుంది.
మొత్తానికి హౌస్ మేట్స్ లో ఎవరికి ఆగడం లేదు. రెండు గ్లాసులు పప్పు రెండు పూట్లకి రావాలి అంటే ఏం చేయాలి అని దివ్య వచ్చి అడిగితే. బకెట్ నీళ్లు వెయ్యాలి అని చెప్పింది. వెటకారం మామూలుగా లేదు. ఈ ఒక్క సందర్భంలోనే కాదు, ఇదివరకే రిలీజ్ అయిన ప్రోమో లో కూడా ఆవిడ వెటకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ ప్రేక్షకులు కోరుకునేది కూడా ఇదే, ఇలా ఉంటేనే షో ఆసక్తికరంగా ఉంటుంది.
దువ్వాడ మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ఒక స్టేట్మెంట్ చెప్పింది. ఇంకా ఎవరి రంగులు బయటపడలేదు అందరి రంగులు బయటపడేలా చేస్తాను అని చెప్పింది. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ముందు శ్రీజ దమ్ముతో ఆర్గ్యుమెంట్ చేసింది. శ్రీజా దమ్ము ఎలిమినేట్ అవ్వడానికి కూడా ఒక కారణం అయ్యింది.
హౌస్ మేట్స్ అందరూ కూడా దువ్వాడ మాధురికి దాదాపు భయపడి పోవలసిన పరిస్థితికి వచ్చేసారు. భరణి కూడా మరోవైపు ఆవిడతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ తింటున్న టైంలోనే అందరికీ చెప్పాడు. ఒక్క మాట అటు మాట్లాడినా కూడా మామూలుగా రియాక్ట్ కావట్లేదు దువ్వాడ మాధురి.
ఇదివరకే విడుదలైన ప్రోమోలో కూడా దివ్యతో కిచెన్ లో ఉండవలసిన సామాన్లు గురించి కూడా ముందే చెప్పేసింది. కళ్యాణ్ కూర్చోమని అడిగినా కూడా ఏం నిలబడితే చెప్పవా అని తిరిగి ప్రశ్నించింది. మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడుతాను అని కళ్యాణ్ కూడా అనడం ప్రోమోలో మనం చూసాం. ఏదేమైనా శ్రీజ లేని లోటును దువ్వాడ ప్రస్తుతానికి పూరిస్తుంది.