Big Stories

LOTTERY: లాటరీ గెలుచుకున్న కూలీ.. పోలీస్ స్టేషన్‌కు పరుగులు.. ఎందుకంటే?

LOTTERY: అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. జాక్‌పాట్ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలానే కేరళలో ఓ కూలీకి జాక్‌పాట్ తగిలింది. రాత్రికిరాత్రే లక్షాధికారి అయ్యాడు. అతని ఆనందానికి అవధులు లేవు. మరోవైపు ఆ లాటరీ ఎవరైనా కొట్టేస్తారేమోనని భయం. ఈక్రమంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులను ఆశ్రయించాడు.

- Advertisement -

పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాదేశ్ అనే వ్యక్తి కేరళలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్లుగా కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లాటరీని కొనుగోలు చేస్తున్నాడు. కానీ ఎప్పుడూ అదృష్టం అతని తలుపు తట్టలేదు. అయినా కూడా అతను లాటరీ టికెట్లను కొనడం మానలేదు.

- Advertisement -

ఇటీవల మళ్లీ బాదేశ్ ఒక లాటరీ కొనుగోలు చేశాడు. మంగళవారం లాటరీ నిర్వాహకులు డ్రా తీయగా.. బాదేశ్ కొనుగోలు చేసిన టికెట్ వచ్చింది. అతడు రూ. 75 లక్షలను గెలుచుకున్నాడు. దీంతో అతని సంతోషానికి అవదలు లేకుండా పోయింది. అంతలోనే బాదేశ్‌కు ఒక సందేహం వచ్చింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు. తాను లాటరీ గెలుచుకున్నానని.. తన టికెట్ ఎవరైనా కొట్టేస్తారేమోనని భయంగా ఉందని.. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. అలాగే లాటరీని క్లెయిమ్ చేసుకునే విధానం కూడా తనకు తెలియదని చెప్పాడు.

ఈక్రమంలో పోలీసులు బాదేశ్‌కు అండగా నిలిచారు. తనకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్‌ను అతడికి అర్థమయ్యేలా చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News