Mohan Babu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ఆయన సినిమాలు కానీ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ నటించిన సినిమాలు గానీ వర్కౌట్ కాకపోవచ్చు అది వేరే విషయం. కానీ మోహన్ బాబు కష్టపడి ఈ స్థాయికి రావడం అనేది మామూలు విషయం కాదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా మంచి ఫ్యామిలీ మీద ట్రోలింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. వాళ్లు కూడా వీటి పైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు.
ప్రతి మనిషిలో పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఉంటాయి. కానీ మనం అవతల వ్యక్తి నుంచి ఏం తీసుకుంటున్నాం అనేది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. బయట ఎక్కువ శాతం మోహన్ బాబు కనిపించినప్పుడు ఆయన ప్రవర్తించే తీరు, మాట్లాడే విధానం వీటన్నిటిని బట్టి ఆయనకి అహంకారం, కోపిష్టి ఇలాంటి మాటలను వాడుతూ అతని క్యారెక్టర్ గురించి చెబుతూ ఉంటారు.
మోహన్ బాబు కోపిష్టి అనే విషయం అందరికీ తెలిసిందే. అలానే కోపం అనేది ఒక జెన్యూన్ ఎమోషన్. ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోపం అనేది జెన్యూన్ ఎమోషన్ అని చెబుతుంటాడు.
అయితే మోహన్ బాబు దగ్గర కొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. ఒక సినిమాను చేయడానికి మోహన్ బాబు దర్శకుడు శివ నాగేశ్వరరావు ను తన టీం తో పాటు పిలిచారు. శివ నాగేశ్వరరావు తో పాటు తన కో డైరెక్టర్, అసోసియేట్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అలానే చెన్నై నుంచి వచ్చిన ఇద్దరు రచయితలు దాదాపు ఒక నెల రోజులు పాటు ఆయనతో స్టోరీ సిటింగ్స్ లో కూర్చున్నారు.
స్టోరీ సిట్టింగ్స్ లో ఎవరైనా ఒక మంచి మాట చెప్తే దానిని మోహన్ బాబు పాజ్ చేసి చాలా మంచి మాట చెప్పావు ఐ అప్రిషియేట్ యు అని చెబుతారు. అలానే ఎవరికైనా ఫోన్ చేస్తే మాట్లాడొచ్చా అని ముందు ఆయనే అడుగుతారు. అలా అడిగిన తర్వాత ఆయన మాట్లాడుతారు. చాలామంది అవతల వాళ్ళు ఏ సిట్యువేషన్ లో ఉన్నారో తెలియకుండా మాట్లాడేస్తుంటారు ఈ విషయంలో మాత్రం. ఈ రెండు ఆయనలో ఉన్న గొప్ప విషయాలు.
మోహన్ బాబు కో అంటే కోటి పులిరాజాకు డబ్బు వస్తుందా అని ఒక టైటిల్ తో సినిమాని అనుకున్నారు. అప్పట్లో పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా అనేది ఫేమస్ కొటేషన్. చాలా గోడల మీద కూడా అది కనిపించేది. అని దృష్టిలో పెట్టుకొని పులి రాజాకు డబ్బు వస్తుందా అని ట్యాగ్ లైన్ పెట్టారు.
ఆ కథ పూర్తిస్థాయిలో తెగకు పోవడం వలన ఆ సినిమాను మొదలు పెట్టకుండా మధ్యలోనే ఆపేయవలసి వచ్చింది. అయితే అప్పటికే ఆ సినిమాకి పనిచేస్తున్న అందరికీ కూడా శాలరీలు పడిపోయాయి. ఒక కో డైరెక్టర్ ఊర్లో ఉంటే ఆయనను కూడా ఆఫీస్ కి పిలిపించారు. సినిమా ఇలా క్యాన్సిల్ అయిపోయింది. మీరు ఒకవేళ కో-డైరెక్టర్ గా పని చేయాలి అనుకుంటే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ లో కూడా పనిచేయచ్చు. లేదు అనుకుంటే మీ జీవితం రెడీగా ఉంది తీసుకొని వెళ్ళిపోవచ్చు అని ఆ కో-డైరెక్టర్ కి చెప్పారట.
ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్, మంచితనం కూడా మోహన్ బాబు లో ఉన్నాయి. కానీ బయటకు కనిపించే కొన్ని సందర్భాలు వలన కేవలం ట్రోలింగ్ కు మాత్రమే ఆయనను ఇప్పటిలో ఉన్నవాళ్లు వాడుతున్నారు.
Also Read: Duvvada Madhuri : పడుకుంటున్న సీజన్ లేపడానికి వచ్చిన దేవత, ఎవరిని విడిచిపెట్టని దువ్వాడ మాధురి