BigTV English

Kapaleeswarar Temple : పోర్చుగీసు దండయాత్రకి గురైన కోవెల

Kapaleeswarar Temple : పోర్చుగీసు దండయాత్రకి గురైన కోవెల


Kapaleeswarar Temple : పురాతన ఆలయాలకు ప్రసిద్ధి క్షేత్రాలలకు నిలయం తమిళనాడు. దశాబ్దాల క్రితం కట్టిన గుళ్లు, గోపురాలు తమిళనాట ఏ మూలన చూసినా కనిపిస్తాయి. వందల ఏళ్ల చరిత్ర ఆలయాలో వందల్లో ఉన్నాయి అలాంటిదే ఎనిమిదో దశాబ్దం నాటి కపాలీశ్వరుడి ఆలయం. చెన్నైకి దగ్గరంలోని మైలాపూర్ లో ఈ గుడి ఉండి. శివుడ్ని కపాలీశ్వరుడిగా భక్తులు పూజిస్తుంటారు. పార్వతీదేవి నెమలి రూపంలో ఈ ప్రాంతంలోనే శివుని కోసం ఘోరమైన తపస్సు చేసిందని పురాణాలు చెబుతున్నాయి. మైలాపూర్ అనే పేరు రావడానికి కారణం కూడా ఇదేనంటారు.

ఇక్కడ కపాలీశ్వరుడికి, కర్బగాంబాళ్ అమ్మవారికి వేర్వేరుగా ఆలయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా కుమారస్వామి సన్నిధి కూడా ఉంది. 8 వ శాతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవులే ఈ గుడిని నిర్మించారు. అయితే ఆలయం పోర్చుగీసు వారి దండయాత్రలకి పలుమార్లు గురైంది. దీంతో ఆలయం దెబ్బతింది . అ తర్వాత మళ్లీ 14వ శతాబ్దంలో విజయనగర మహారాజులు ఈ ఆలయ జీర్ణోద్ధారణ కార్యక్రమం జరిగింది.


ప్రస్తుతం తూర్పు దిక్కున్న గోపురం ఎత్తు 108 అడుగులు . అద్బుతమైన శిల్పాకళా నైపుణ్యం ఉట్టిపడేలా ఏడంతస్థుల్లో కనిపిస్తుంది. ఏటా జరిగే వార్షిక బ్రహ్మోతవాల సమయంలో పుష్కరిణి ప్రాంతాలు జనసంద్రంగా మారిపోతుంటాయి. ఎక్కువ తలలు ఉన్నాయని మిడిసిపడ్డ బ్రహ్మకి సంబంధించిన ఒక తలను పరమశివుడి తుంచాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ గర్వభంగమై భూలోకంలోనే శివుడికి గుడి కట్టి ఆరాధించడానికి ఆ ప్రాంతమే ఇదేనని అంటారు.

కపాలీశ్వరుడు కొలువైన మైలాపూరాన్ని కైలాస పురంగా భక్తులు భావిస్తుంటారు. నాలుగు వేదాలను పూజించడం వల్ల ఈ ప్రాంతాన్ని వేదపురిగా పిలుస్తారు. రావణ యుద్ధానికి ముందు రాముడు ఈ ఆలయంలో పూజ చేసి విజయం సాధించాడని అంటారు. శుక్రాచార్యుడు పూజ చేసి తాను కోల్పోయిన నేత్రాన్ని ఇక్కడ స్వామి దయతో పొందాడని పురాణాల్లో ఉంది. కుమారస్వామికి శక్తివేల్ అనే ఆయుధం కూడా ఇక్కడ నుంచే గ్రహించాడు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×