Effects Of Veedhi Potu : వీధిశూల ఉన్న ప్రతీ స్థలం లేదా ఇల్లు నిర్మాణానికి పనిచేయడం మంచిది కొందరు చెబుతుంటారు. కానీ అందులో నిజం లేదంటున్న వాస్తు నిపుణులు . దేవుడ్ని ఊరేగించే దారిని వీధి అంటారు. పాతకాలంలో రథాలు మలుపు తిరిగేటప్పుడు ఏ చక్రమో వూడిపడిపోయి మన యింటి గోడమీద పడే ప్రమాదం వుంది కాబట్టి వద్దన్నారట. రుద్రభూమికి వెళ్లేదారి దారిని వీధి కింద లెక్కలోకి రాదు. రాజవీధి, మహారాజ వీధి, ఉపవీధి అని రకాలు ఉఁటాయి. వీధిశూలలు మొత్తం 16 రకాలుఉన్నాయి. వీధి శూల, వెన్నుపోటు రెండు వేర్వేరు. వీధిశూల లెక్కించెటప్పుడు ముందు ఆ వీధి ఎలాంటి కండిషన్ లో ఉందో తెలుసుకోవాలి. దేవతలు ఊరేగింపు ఉందా లేదా ఎలాంటి విషయాలకి దారిని ఉపయోగిస్తున్నారో గుర్తించాలి. ఇంటి ఎదురుగా ఉంటే రోడ్డు వెడల్పు కంటే తక్కువ ఉంటే వీధిశూల కిందకి రాదు.
రాజవీధి రోడ్డు 40 అడుగులు ఉండి ఇంటి ఎదురుగా రోడ్డు 30 అడుగులు ఉంటే టీ షేప్ లో ఉంటే అది వీధి శూల కిందగా పరిగణించకూడదు.వీధిశూలలు కొన్ని మంచిని కలిగిస్తున్నాయి. మరికొన్ని చెడుఫలితాలను ఇస్తాయి. మూలలు వీధిపోటుకి మంచివి కావు. ఇంటి కోణం ఎప్పుడు వీధికి తగలకూడదు. ఉచ్చస్థానాల్లో వీధి శూల మంచిది. తూర్పు, తూర్పు ఈశాన్యం, ఉత్తరం, ఊత్తర ఈశాన్యం, పడమర, పశ్చిమ వాయువ్యం, దక్షిణం, దక్షిణ ఆగ్నేయం , ఈ 8 ఉచ్చస్థానాలుగా లెక్కిస్తారు. కొన్ని రకాల వీధిశూలల పరిహారం చేయడం ద్వారా కొంత వరకు పరిష్కారం అవుతాయి.
ఇంటికి వెన్నుపోటు ఉంటే వంశం వృద్ధి చెందదు. మన తర్వాత తరం లేకుండా ఆగిపోతుంది. అలా కొన్ని ఇళ్లల్లో అవ్వక వారి వంశం వృద్ధి ఆగిపోతుంది. పశ్చిమ నైరుతిలో వీధి శూల ఉంటే వంశం వృద్ధి జరగదు. పశ్చిమ నైరుతి మగసంతాన ప్రాప్తికి కారణమవుతుంది. పశ్చిమనైరుతిలో శూల వస్తే మగసంతనం కలగరు