E-Paper
Advertisement

Tirumala Srivari Sevas: తిరుమల శ్రీవారికి ప్రతిరోజు జరిగే ప్రత్యేక సేవలెంటో తెలుసా..? వాటిలో  ఎలా పాల్గొనాలంటే..?

Tirumala Srivari Sevas: తిరుమల శ్రీవారికి ప్రతిరోజు జరిగే ప్రత్యేక సేవలెంటో తెలుసా..? వాటిలో  ఎలా పాల్గొనాలంటే..?
Advertisement

Tirumala Srivari Sevas: తిరుమల శ్రీవారికి ప్రతిరోజు అద్బుతమైన సేవలు జరుగుతుంటాయి. ఆ సేవల్లో పాల్గొన్న భక్తులకు జన్మధన్యం అయినట్టేనని పండితులు చెప్తుంటారు. అయితే ఆ సేవలేంటి..? వాటిలో భక్తులు పాల్గొన్నాలంటే ఏం చేయాలి. అనే విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల శ్రీనివాసునికి ప్రతినిత్యం ఎన్నో రకాలు కైంకర్యాలు జరుగుగుతుంటాయి. తెల్లవారుజామున మొదలైన సేవలు దర్శనాలు అర్ధ్రరాత్రి వరకు కొనసాగుతుంటాయి. కొన్ని ప్రత్యేక రోజుల్లలో అయితే ఇరవై నాలుగు గంటలు జరుగుతూనే ఉంటాయి. అయితే స్వామి వారికి జరిగే కొన్ని సేవలు మాత్రం చాలా స్పెషల్‌ అంటున్నారు పండితులు. ఆ సేవల్లో పాల్గొనాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలంటున్నారు. ఆ సేవల్లో పాల్గొంటే స్వామి వారి దివ్యాశ్శీసులు లభిస్తాయంటున్నారు. ఆ సేవలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కల్యాణోత్సవం ( kalyanostavam) :

ఈ సేవకు భక్తులు ఉదయం 10 గంటలకల్లా సుపదం ఎంట్రన్స్ నుండి వెళ్ళవలసి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి కళ్యాణం మొదలవుతుంది. కళ్యాణం తరువాత దర్శనం పూర్తయి మీరు బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం రెండున్నర గంటల అవుతుంది.

Advertisement

ఊంజల్ సేవ (unjal seva) :

ఊంజల్‌ సేవకు భక్తులను  ఉదయం 11 గంటలకు అనుమతిస్తారు. భక్తులందరూ సుపదం ఎంట్రన్స్ నుంచి స్వామి వారి ఆలయంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ముందుగా స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత దేవాలయంలో ఉన్న అద్దాల మండపంలో కొద్దిసేపు వెయిట్‌ చేయాలి. తర్వాత ఊంజల్‌ (Unjal) సేవ నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొన్న భక్తులు సేవ పూర్తయి బయటకు వచ్చే సరికి మధ్యాంహ్నం మూడున్నర గంటలు అవుతుంది.

ఆర్జిత బ్రహ్మోత్సవం ( Arjitha Bahmostavam):

ఈ సేవ స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న వైభోత్సవ మండపంలో జరుగుతుంది. ఈ మండపం రాం భగీచా గెస్ట్ హౌస్ 1 పక్కనే ఉంటుంది. ఈ సేవ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మొదలవుతుంది. తర్వాత మూడు గంటలకు సుపదం ఎంట్రన్స్ ద్వారా దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. దర్శనం పూర్తయి బయటకు వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటల  అవుతుంది.

సహస్ర దీపాలంకార సేవ:

ఈ సేవ స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపం వద్ద నిర్వహిస్తారు. భక్తులు సాయంత్రం నాలుగున్నర కల్లా ఈ మండపం వద్దకు రావలసి ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ఈ సేవ ప్రారంభమవతుంది. సేవ అనంతరం సుపదం ఎంట్రన్స్ ద్వారా దర్శనానికి వెళ్లి దర్శనం పూర్తయి బయటకు వచ్చేసరికి రాత్రి ఏడున్నర గంటలు అవుతుంది.

ఎలా పాల్గొన్నాలి:

ఈ నాలుగు సేవలకు భక్తులు మూడు నెలల ముందుగానే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారు అనౌన్స్‌ చేసిన సమయంలో ఆన్‌లైన్‌ (online) లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టిక్కెట్ అవసరం లేదు. ఈ నాలుగు సేవలు ఉత్సవ మూర్తులయిన మలయప్ప స్వామి వద్ద జరుగుతాయి. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ జరిగిన తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. Unjal సేవకు మాత్రం ముందుగా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అద్దాల మండపంలో సేవ నిర్వహిస్తారు. ఈ నాలుగు సేవలకు భక్తులు జయ విజయుల వద్ద నుండి మాత్రమే దర్శనం చేసుకోవలసి ఉంటుంది. ఈ నాలుగు సేవలకు భక్తులను దేవాలయం పక్కనే ఉన్న సుపదం ఎంట్రన్స్ నుండి పంపుతారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కురుక్షేత్రంలో కృష్ణుడు పూరించిన శంఖం స్పెషల్ ఏంటో తెలుసా – ఇంకా ఎవరెవరు శంఖం పూరించేవారంటే..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×