E-Paper
Advertisement

Vastu Tips: మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే అంతా అదృష్టమే.. అవేంటో తెలుసా ?

Vastu Tips: మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే అంతా అదృష్టమే.. అవేంటో తెలుసా ?
Advertisement

Vastu Tips For Home: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే అదృష్టం అని చెబుతారు. కొన్ని రకాల వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని.. వ్యాపార సంస్థల్లో ఉంటే మంచి లాభాలు వస్తాయని నమ్ముతారు. వందల ఏళ్లుగా ఇలాంటి నమ్మకాలు మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో ఉన్నాయి. కొన్ని వస్తువులను ఇళ్లలో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని పెద్దలు చెబుతారు. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాబేలు విగ్రహం:
తాబేలు విగ్రహాన్ని మనం చాలా వరకు షాపుల్లో చూసి ఉంటాం. ఒక చిన్నసైజు ప్లేటులో నీళ్లు వేసి అందులో తాబేలు ఉంచుతారు. తాబేలును లక్ష్మీదేవితో పోలుస్తారు. తాబేలు విగ్రహాన్ని ఇళ్లలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఉన్నట్లే అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. తాబేలు విగ్రహం ఇళ్లలోనే కాదు షాపుల్లో కూడా పెట్టుకోవచ్చని అంటున్నారు. చాలా మంది తాబేలు ఉంగరాన్ని కూడా ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల అదృష్టం కలసి వస్తుందని భావిస్తారు.
దేవతా విగ్రహాలు:
దేవతా విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ప్రదేశంలో నెగటివ్ ఎనర్జీ రాదని నమ్ముతారు. అందుకే ఇంట్లో దేవుళ్ల విగ్రహాలను పెట్టుకుంటారు. ఏ సమస్య వచ్చినా ఆ విగ్రహాలను చూస్తే ఒక ధైర్యం, కష్టాలు ఎదుర్కోవడానికి విగ్రహాలు బలాన్నిస్తాయన్న నమ్మకం హిందువులలో ఉంటుంది. అందుకే ప్రతి ఇంట్లో ఓ దేవుడి గది ఉంటుంది.
నిమ్మకాయ దండ:
నిమ్మకాయలు, మిరపకాయలు, గవ్వలు కట్టి చుట్టడం.. దాని వాహనాలకు కట్టడం లేదా షాపుల్లో వేలాడదీయడం మనం చూస్తుంటాం. ఇది కూడా అదృష్టంగా భావిస్తారు. నరదృష్టి తొలగించడానికి నిమ్మకాయల దండను కడతారు. షాపుపై నరదృష్టి పడితే ఈ నిమ్మకాయలు, మిరపకాయలు దాన్ని తొలగిస్తాయని నమ్ముతారు.

Advertisement

Also Read: ఈ రాశుల వారి సొంతింటి కల నెరవేరుతుంది.. మీది కూడా ఈ రాశేనా ?

గ్లాస్ నీటిలో నిమ్మకాయ:
ఒక గ్లాస్ నీటిలో నిమ్మకాయ ఉంచి షాపులో పెట్టుకుంటే లాభాలు వస్తాయని కొందరి నమ్మకం. జ్యోతిష్య పండితులు కూడా ఇది నిజమని చెబుతున్నారు. నీటిలో నిమ్మకాయను ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఉండదని అంతేకాకుండా లక్ష్మీదేవి కృప ఉంటుందని అంటున్నారు.

Advertisement

(Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడినది. bigtvlive.com దీన్ని ధృవీకరించడం లేదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×