BigTV English

Stormy Daniels: ‘ఆయనకు అపరాధ భావన ఉండొచ్చు.. కానీ నేను మాత్రం ఆ మచ్చతోనే జీవితాన్ని గడపాలి’

Stormy Daniels: ‘ఆయనకు అపరాధ భావన ఉండొచ్చు.. కానీ నేను మాత్రం ఆ మచ్చతోనే జీవితాన్ని గడపాలి’

Stormy Daniels and Trump Comments: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవొచ్చంటూ ఆయన పేర్కొన్నారు. దేనికైనా ఓ పరిమితి ఉంటుంది.. అలాగే తనని అభిమానించేవారికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనను జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు తప్పకపోవొచ్చునంటూ ట్రంప్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. అయితే, తనకు మాత్రం వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పుకొచ్చారు.


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం విధితమే. శృంగార తార స్టార్మీ డానియల్స్ కు డబ్బు చెల్లింపు, అందుకోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో న్యూయార్క్ కోర్టు తీర్పు వెల్లడించింది. మొత్తం 34 అభియోగాల్లో ట్రంప్ ను దోషిగా నిర్ధారించింది. జులై 11న శిక్ష ఖరారు చేయనున్నది. దీంతో ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.

అయితే, ట్రంప్ నకు జైలు శిక్ష పడొచ్చంటూ అంచనాలు వెలువడుతున్నాయి. వీటిపై స్పందించిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తనపై నేరారోపణలు, న్యాయపరమైన చిక్కుల వల్ల సతీమణి మెలానియా ట్రంప్ తీవ్ర ఆవేదనకు గురవుతుందంటూ ఆయన తెలిపారు. మొత్తం కుటుంబంపైనా ఈ వ్యవహారం ప్రభావం చూపుతోందని వెల్లడించారు. తన కంటే తన కుటుంబమే ఎక్కువ క్షోభ అనుభవిస్తోందంటూ పేర్కొన్నారు.


కాగా, ట్రంప్ దోషిగా తేలడంపై స్టార్మీ డానియల్స్ మొదటిసారి స్పందించింది. ఇంత త్వరగా తీర్పు వెలువడటం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ట్రంప్ కు జైలు శిక్ష విధించాలని కోరింది. ట్రంప్ దోషిగా తేలినంత మాత్రాన తనకు ఈ కేసు ముగిసినట్లు కాదని వ్యాఖ్యానించింది. ఆయనకు అపరాధ భావన ఉండొచ్చు.. కానీ తాను మాత్రం ఆ మచ్చతోనే జీవితాన్ని గడపాలి అంటూ పేర్కొన్నది.

Also Read: వేలంలో లేఖలు.. అందులో ఆమె వ్యక్తిగత విషయాలు కూడా..

మరో విషయం ఏమంటే.. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ లో ట్రంప్ తాజాగా ఖాతా తెరిచారు. ఖాతా తెరవడాన్ని తాను గౌరవింగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన ఓ వీడియోను అందులో పోస్ట్ చేశారు. ఆదివారం తెల్లారేసరికల్లా టిక్ టాక్ లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ను తన సొంతం చేసుకున్నారు. కేవలం ఆ ఒక్క వీడియోకే 1 మిలియన్ లైక్స్, 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కాగా, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టిక్ టాక్ ను నిషేధించే దిశగా ట్రంప్ చర్యలు తీసుకున్న విషయం విధితమే.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×