BigTV English

Astrology: ఈ రాశుల వారి సొంతింటి కల నెరవేరుతుంది.. మీది కూడా ఈ రాశేనా ?

Astrology: ఈ రాశుల వారి సొంతింటి కల నెరవేరుతుంది.. మీది కూడా ఈ రాశేనా ?

 Astrology: ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. చాలా మంది తమ జీవితంలో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. కొందరు ఏళ్ల నుంచి డబ్బులు పోగు చేసి ఇల్లు కట్టుకుంటారు. అయితే ఇప్పుడు జ్యోతిష్యానికి ఇల్లు కట్టుకోవడానికి ఏంటి సంబంధం అని  అనుకుంటున్నారా ? జ్యోతిష్యానికి సంబంధం లేనిది ఏదీ ఉండదు. గ్రహాలు మనుషులపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశి వారికి ఇల్లు కట్టుకునే యోగం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.


వృషభ రాశి:

ఈ రాశి వారికి ఇల్లు కట్టుకునే యోగం ఉంది. వీరిలో స్థిరత్వం కనిపిస్తుంది. వీరు ఒక మాటపై ఉండి ప్రతీ పనిని పూర్తి చేయడానికి నిబద్ధతతో పనిచేస్తారు. డబ్బు ఆదా చేసే లక్షణం కూడా ఈ రాశి వారిలో ఉంటుంది. ఇదే వారిని ఇల్లు కట్టుకునేలా చేస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఇల్లు కుటుంబ, భద్రత విషయంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. కుటుంబ సభ్యులతో ఈ రాశి వారు సంతోషంగా గడుపుతారు. వీరు మనస్పూర్తిగా ఉండటం వల్ల ఇల్లు కట్టుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశి వారు వారి పిల్లలు పెద్దయ్యే వరకు ఇల్లు కట్టి వారికి ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.

మకర రాశి:

ఈ రాశి వారిలో బాధ్యత, క్రమ శిక్షణ ఎక్కువగా ఉంటాయి. వీరిలో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు వీరు పట్టువదలరు. ఏదైనా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని పూర్తి చేసే వరకు విశ్రమించకుండా పని చేస్తారు. డబ్బును ఆదా చేసే గుణం వీరిలో ఉంటుంది. తద్వారా ఆ డబ్బులు ఇల్లు కట్టుకోవడానికి దోహదం చేస్తాయి. మకర రాశి వారు కచ్చితంగా ఇల్లు కట్టుకుని తీరుతారు.

కన్యా రాశి :

ఈ రాశి వారిలో క్రమ శిక్షణ అధికంగా ఉంటుంది.వీరి ఆర్థిక ఎదుగుదలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇల్లు సులువుగా కట్టుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. వీరు డబ్బు ఆదా చేసే గుణం కలిగి ఉంటారు. వీరు కుటుంబంతో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకోసం ఇంటిని కట్టుకోవాలని అనుకుంటారు.

Also Read: జ్యేష్ఠ అమావాస్య నాడు ఇలా చేస్తే.. పితృ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది

గ్రహాల ప్రభావంతో పాటు సొంతంగా కృషి చేస్తే ఈ రాశుల వారి సొంతింటి కల నెరవేరుతుంది. గ్రహాలు అనుకూలించినప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు పూర్తి చేయగలుగుతారు. పై నాలుగు రాశుల వారు ఇల్లు కట్టుకోవడం విషయంలో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Related News

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Big Stories

×