BigTV English

Laxmi Narayan Yog: ధన త్రయోదశి నాడు లక్ష్మీ నారాయణ యోగం.. 5 రాశుల వారు పట్టిందల్లా బంగారం

Laxmi Narayan Yog: ధన త్రయోదశి నాడు లక్ష్మీ నారాయణ యోగం.. 5 రాశుల వారు పట్టిందల్లా బంగారం

Laxmi Narayan Yog: 29 అక్టోబర్ 2024 మంగళవారం నాడు ధన త్రయోదశి పండుగ జరుపుకోనున్నాము. ఈ రోజున, సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, ధన్వంతరి, సంపదకు రక్షకుడైన కుబేరుడిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజు బంగారం, వెండి, ఆభరణాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈసారి ధన త్రయోదశి నాడు, ‘లక్ష్మీ నారాయణ యోగం’ ఏర్పడనుంది. ఇది 5 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ 5 రాశుల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఈ ధనత్రయోదశి అద్భుత ఫలితాను ఇవ్వనుంది.ధనత్రయోదశి రోజు ఏర్పడనున్న లక్ష్మీ నారాయణ యోగం ఈ వ్యక్తులకు ఆఫీసుల్లో విజయాన్ని అందిస్తుంది. వైవాహిక జీవితంలో వారి భాగస్వామితో వారి సంబంధం మరింత బలపడుతుంది. వ్యాపారస్తులకు శుభవార్తలు అందుతాయి. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. కెరీర్ పరంగా విద్యార్థులకు చాలా బాగుంటుంది. పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు.


మిథున రాశి:
ధనత్రయోదశి రోజు ఏర్పడుతున్న లక్ష్మీ నారాయణ యోగం మిథునరాశి వ్యక్తుల జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తుంది. ఈ వ్యక్తులు చాలా శుభవార్తలను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పని చేసే చోట కొత్త బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనస్సు ఆనందంగా ఉంటుంది. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనేక కార్యక్రమాల్లో మీ గుర్తింపు పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కూడా ఆ ఈ సమయంలో పెరుగుతాయి. అంతే కాకుండా డబ్బును కూడా ఆదా చేస్తారు.

కర్కాటక రాశి:
వ్యాపారులకు లక్ష్మీ నారాయణ యోగం చాలా శుభప్రదం కానుంది. ఎవరి ప్రేమ జీవితం టెన్షన్‌లో ఉంటుందో.. అది దూరమవుతుంది. డబ్బు పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలను విని సంతోషిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్న పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు మీకు లభిస్తుంది.

Also Read: దీపావళి రోజు ఈ 5 పరిహారాలు చేస్తే.. అదృష్టం మీ తలుపు తట్టినట్టే !

వృశ్చికరాశి:
ధనత్రయోదశి నుండి వృశ్చిక రాశి వారి జీవితాలు మెరుగుపడతాయి. ఈ వ్యక్తుల ఆర్థిక పరిస్థితిలో ఊహించని ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఆదాయం పెరగడం వల్ల మనస్సు ఆనందంగా ఉంటుంది. అంతే కాకుండా ఒత్తిడి నుండి ఉపశమనం ఉంటుంది. సౌకర్యాలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.ఇది భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చి పెడుతుంది.

మీన రాశి :
ధనత్రయోదశి రోజు ఏర్పడుతున్న లక్ష్మీ నారాయణ యోగం మీన రాశి వారి జీవితాల్లో ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది.మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. కార్యాలయంలో కొనసాగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ కోరిక మేరకు ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×