E-Paper
Advertisement

Life Lessons From Lord Shiva: బ్యాలెన్స్‌డ్ లైఫ్ కోసం పరమేశ్వరుడి.. 7 ఆచరణీయ మార్గాలు

Life Lessons From Lord Shiva: బ్యాలెన్స్‌డ్ లైఫ్ కోసం పరమేశ్వరుడి.. 7 ఆచరణీయ మార్గాలు
Advertisement

Life Lessons From Lord Shiva: హిందూ ధర్మంలో మహాదేవుడిగా పూజలందుకునే పరమశివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు. ఒక ఆదర్శప్రాయమైన యోగి, గురువు. ఆయన జీవితం, రూపం, లీలల ద్వారా మనం సమతుల్యమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఎన్నో గొప్ప పాఠాలను నేర్చుకోవచ్చు. శివుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన 7 ముఖ్యమైన జీవిత పాఠాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వైరాగ్యం- బంధాల నుంచి విముక్తి:
శివుడు కైలాసంలో నిరాడంబరంగా..భౌతిక సుఖాలకు ఆశపడకుండా ఉంటాడు. ఆయన పులి చర్మాన్ని ధరిస్తాడు. అంతే కాకుండా ఒంటికి భస్మం పూసుకుంటాడు.

Advertisement

పాఠం: నిజమైన ఆనందం బయటి వస్తువులలో కాదు, మన అంతరంగంలోనే ఉంది. మనం ధనం,హోదా, తాత్కాలిక బంధాలపై అతిగా ఆసక్తి చూపకుండా, వాటిని సాధనాలుగా మాత్రమే చూడాలి. ఇది మనసును ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉంచుతుంది.

2. అంతర్ముఖం & ధ్యానం – అంతర్గత శక్తి:
శివుడిని ‘ఆదియోగి’ అని అంటారు. ఆయన అనేక గంటలు ధ్యానంలో మునిగి ఉంటారు.

Advertisement

పాఠం: జీవితంలో ఎంత గందరగోళం ఉన్నా.. కొంత సమయాన్ని ధ్యానం లేదా నిశ్శబ్దానికి కేటాయించడం ముఖ్యం. ధ్యానం ఏకాగ్రతను పెంచుతుంది. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. మనలోని అంతర్గత శక్తిని మేల్కొల్పి, సమస్యలను ప్రశాంతంగా ఎదుర్కోవడానికి సహాయ పడుతుంది.

3. కపటం లేని జీవితం:
శివుడు తన మెడలో విష సర్పాలనూ, జటలో గంగనూ ధరించినా.. ఆయన జీవనశైలి అత్యంత సరళంగా ఉంటుంది.

పాఠం: జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ.. వినయం, సరళత కోల్పోకూడదు. బాహ్య ఆడంబరాల కన్నా, మన అంతరంగ గుణాలు, నైజమే ముఖ్యమని ఆయన నిరూపిస్తారు. ఎలాంటి సందర్భంలోనైనా మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి.

4. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం:
సముద్ర మథనం సమయంలో వచ్చిన హాలాహలాన్ని (విషాన్ని) శివుడు లోక రక్షణ కోసం తాగి.. గొంతులో ఆపుకున్నాడు.

పాఠం:ఇది మనకు సహనం, స్వీయ నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. జీవితంలో వచ్చే ప్రతికూల అంశాలను, చేదు అనుభవాలను మనలో ఇముడ్చుకోవాలి. కోపం లేదా చెడు ఆలోచనలను ఇతరులపై ప్రదర్శించకుండా.. వాటిని నియంత్రించుకోవాలి.

5. సమతుల్యత- శక్తి ఐక్యత:
శివుడి అర్ధనారీశ్వర రూపం (సగం శివుడు, సగం పార్వతి) ప్రకృతిలోని స్త్రీ-పురుష శక్తుల సమతుల్యతను సూచిస్తుంది.

పాఠం: మన జీవితంలోనూ సమతుల్యత అవసరం. పని-విశ్రాంతి, బాధ్యతలు-ఆనందం, భావోద్వేగం-తర్కం మధ్య సరైన సమన్వయం ఉండాలి. అప్పుడే జీవితం పరిపూర్ణంగా ఉంటుంది.

6. మార్పును స్వీకరించడం:
శివుడు ‘సంహార కారకుడు’. ఆయన వినాశనాన్ని సృష్టించినా.. అది కొత్త సృష్టికి మార్గం సుగమం చేస్తుంది.

పాఠం: జీవితంలో మార్పు అనేది అనివార్యం. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు.. వాటిని అంతంగా కాకుండా, కొత్త ఆరంభానికి, ఉన్నతికి దారిగా భావించాలి. పాత ఆలోచనలు, అలవాట్లను వదిలించుకుంటేనే కొత్త దానికి చోటు దొరుకుతుంది.

Also Read: సాయంత్రం పూట ఈ పనులు చేస్తే.. పరమ దరిద్రం

7. అందరి పట్ల ప్రేమ:
శివుడు దేవుళ్లను, రాక్షసులను, దయ్యాలను, భూతాలను అందరినీ సమానంగా చూసేవాడు.

పాఠం: గొప్ప-పేద, మంచి చెడు అనే తేడాలు లేకుండా అందరి పట్ల దయ, సమానత్వంతో వ్యవహరించాలి. ఆయన మెడలోని విష సర్పం, వాహనమైన నంది, వెంట ఉండే గణాలు ఇవన్నీ కూడా ఆయన అన్ని జీవుల పట్ల చూపిన ప్రేమకు నిదర్శనం.

శివుడి ఈ ఏడు పాఠాలు మన రోజువారీ జీవితంలో ఆచరిస్తే.. మనం కేవలం లౌకిక విజయాలకే పరిమితం కాకుండా అంతర్గత శాంతి, స్థిరత్వం, సంతృప్తితో కూడిన సమతుల్య జీవితాన్ని గడపగలుగుతాము.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×